తెలంగాణలోని ప్రొద్దుటూరులో ‘ఎక్స్ పీరియం ఎకో పార్క్’ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవిల మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ప్రతి సందర్భంలో చిరంజీవికి రేవంత్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత సభలో కూడా చిరును ప్రస్తావించారు రేవంత్. ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి కూడా రేవంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారని, అయినప్పటికీ ఈ ఎకో పార్క్ ఓపెనింగ్‌కు రావడం సంతోషంగా ఉందని కొనియాడారు.
ఇటువంటి పార్కులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, వీటి వల్ల ఎంతో మందికి ఉపాధి, రాష్ట్రానికి టూరిజం పెరుగుతుందని అన్నారు. ఈ తరహా పార్కులకు ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే ల్యాండ్ మార్క్ పార్క్ అవుతందని అన్నారు.
హైదరాబాద్ పరిధిలో అంతర్జాతీయ స్థాయిలోని మొక్కలు లభించడం, అద్భుతమైన కళాఖండాలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసిన రామ్‌దేవ్ ఒక కళాకారుడని, పాతికేళ్లుగా పరిశోధనలు చేసి, దేశవిదేశాల నుంచి కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు, శిలలు తెచ్చారని అన్నారు. ఇక్కడ తొలి సినిమా షూటింగ్ అవకాశం తనకే ఇస్తానని చెప్పారని, అయితే, ఈ ఎండలో తాను డ్యాన్స్ చేయలేనేమోనని సెటైర్లు వేశారు. వచ్చే వింటర్ లో తప్పకుండా ఇక్కడ షూటింగ్ చేస్తానని అన్నారు.
ఒకప్పుడు మొక్కలకు వేలు, లక్షలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం కోట్లలో చెబుతున్నారని చిరు చెప్పారు. అయితే, తన సంపాదన ఇప్పుడు అంతంత మాత్రమేనని, వాటిని కొనలేనేమోనని రాం దేవ్‌తో చెబుతుంటానని చిరు సెటైర్లు వేశారు. అయితే, ఒకసారి వచ్చి ఆ మొక్కలు చూస్తే టెంప్ట్ అవుతారని రాం దేవ్ చెబుతుంటారని చిరు అన్నారు.
This post was last modified on January 28, 2025 7:00 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…