అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య ఇప్పటిదాకా చేయని ఊర మాస్ లుక్ తో తండేల్ లో కనిపించడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. లవ్ స్టోరీతో సక్సెస్ ఫుల్ జోడి అనిపించుకున్న సాయిపల్లవి హీరోయిన్ అనగానే సామాన్య ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. సంక్రాంతి సినిమాల హడావిడి దాదాపు కొలిక్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరి కళ్ళు తండేల్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 7 మీదున్నాయి.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ఇవాళ లాంచ్ చేశారు. కథా కథమీషూ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.
శ్రీకాకుళం సముద్ర తీరంలో పొట్టపోసుకునే రాజు (నాగచైతన్య) కి బుజ్జి(సాయిపల్లవి)నే ప్రపంచం. ఆమెను ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో బ్రతుకు తెరువు కోసం సముద్రంలోకి వెళ్లిన రాజుతో పాటు అతని మిత్రుల పడవలు పాకిస్థాన్ ఆర్మీకి చిక్కుతాయి. వెంటనే జైల్లో పారేస్తారు.
హేళనలు, అవమానాల మధ్య దేనికి భయపడని రాజు తనతో పాటు స్నేహితులను బయటికి తీసుకొచ్చేందుకు పూనుకుంటాడు. ప్రమాదకరమైన శత్రుదేశానికి అసలెందుకు వెళ్లారు, అక్కడి పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చి బుజ్జితల్లిని రాజు ఎలా పెళ్లి చేసుకున్నాడనేది స్టోరీ.
స్వచ్ఛమైన అలల నేపథ్యంలో తండేల్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతానికి తోడు శామ్ దత్ ఛాయాగ్రహణం టెక్నికల్ గా స్థాయిని పెంచాయి. చైతు, సాయిపల్లవిల ప్రేమని దర్శకుడు చందూ మొండేటి చూపించిన విధానం ఎమోషనల్ గా ఉంది. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే ఇలాంటి కథ మరోసారి ఈ జంటకు దొరకడం లక్కీనే.
అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మాణ విలువలు వాళ్ళు చెప్పుకున్నట్టే గ్రాండ్ గా ఉన్నాయి. పాకిస్థాన్ స్థానమేంటో చెబుతూ ఊరకుక్కల పోలికతో చెప్పించిన డైలాగ్ కి విజిల్స్ ఖాయం. ట్రైలర్ తో తన లక్ష్యాన్ని చేరుకున్న తండేల్ ఇక థియేటర్లలో దాన్ని అందుకోవడమే తరువాయి.
This post was last modified on January 28, 2025 7:28 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…