ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడికి ఆ అవసరం లేదు. ఎందుకంటే పాలన విషయంలో ఆయనకున్న అనుభవం అలాంటిది. అయితే.. ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూటమి సర్కారును ఏర్పాటు చేయటం వరకు ఓకే కానీ.. గతానికి భిన్నంగా ప్రభుత్వం మీదా.. పాలన మీద పట్టు విషయంలో కాస్త తేడాగా మారిన పరిస్థితి.
విపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా తిప్పలు పెట్టిన అధికారులకు సైతం కీలక పదవులు కట్టబెట్టటంతో పాటు.. రోజులు గడుస్తున్నకొద్దీ.. కీలక అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి. చివరకు బాబుకు అనుకూల మీడియాగా చెప్పుకునే మీడియా సంస్థల ప్రత్యేక కథనాల్లోనూ చంద్రబాబు నిర్ణయాలపై విమర్శలు చేయటం.. కథనాలు రావటం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్.. ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జారీ చేశారు.
సోమవారం రాత్రి వేళలో 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేయగా.. కాసేపటికే 25 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావటం హాట్ టాపిక్ గా మారింది. ఐఏఎస్ ల బదిలీల నేపథ్యంలో ఎవరికి ఎలాంటి పోస్టులు లభించాయి అన్నది చూస్తే..
- ఏపి స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తిరిగి నియమిసతున్నట్లుగా పేర్కొన్నారు.
- హౌసింగ్ డిపార్టమెంట్ స్పెషల్ ఛీప్ సెక్రటరీ అజయ్ జైన్‌కు టూరిజం అండ్ కల్చరల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
- ఎక్స్అఫీసియో చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్‌కు పశు సంవర్ధక, డైరీ, మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు
- కె సునీతను పబ్లిక్ ఎంట్రర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ
- సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వాణీ మోహన్‌కు ఆర్కియాలజీ, మ్యూజియం కమీషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత.
- పీయూష్ కుమార్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కంటిన్యూ చేస్తూనే.. ప్లానింగ్ డిపార్టమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు
- ముఖేష్ కుమార్ మీనాను జీఏడీ పోలిటికల్ సెక్రటరీగా బదిలీ
- ఎస్ సురేష్ కుమార్‌ను ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ
- సౌరబ్ గౌర్ సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నియామకం.
- కోన శశిధర్‌ను ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు
- కాటమనేని భాస్కర్‌ను ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ కార్యదర్శిగా బదిలీ. వీరికి ఆర్టీజీఎస్, గ్రామ వార్డు సచివాలయాలు కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు
- వి. కరుణను సెర్ప్ సిఇవోగా బదిలీ
- ఎన్ యువరాజ్‌కు ఐ అండ్ ఐ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు
- ఎంఎం నాయక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి.
- ప్రవీణ్ కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి
- కన్నబాబును సిఆర్డీఏ కమీషనర్‌గా నియామకం.
- ఎంవి శేషగిరిబాబును కమిషనర్ లేబర్ డిపార్టమెంట్‌కు బదిలీ
- ఎస్ సత్యనారాయణను బిసి వెల్పేర్, ఈడబ్ల్యూఎస్ సెక్రటరీగా నియామకం..
- వాడ్రేవు వినయ్‌చంద్‌ను రివెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీ
- జి వీరపాండ్యన్‌ను వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
- హరినారాయణ్‌ను ఐజి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌కు బదిలీ
- పీఎస్ గిరీషాను ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండిగా బదిలీ
- పి సంపత్ కుమార్‌ను సిడిఎంఏగా బదిలీ
- వి అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు
బదిలీలు అయిన ఐపీఎస్ వివరాల్లోకి వెళితే.. - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా ఆర్కే మీనా
- శాంతి భద్రతల అదనపు డీజీగా ఎన్. మధుసూధన్ రెడ్డి బదిలీ
- ఆపరేషన్స్ ఐజీపీగా సీహెచ్ శ్రీకాంత్ నియామకం. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగా కూడా ఆయన అదనపు బాధ్యతలు.
- ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా పాలరాజు,
- ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా రాజ్ కుమారి
- తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్‌రాజుకు బాధ్యతలు
- కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
- కాకినాడ ఎస్పీగా బింధు మాధవ్ నియామకం
- ఎర్రచందనం యాంటి టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడిని బదిలీ
- గ్రేహౌండ్స్ డీజీగా బాబ్జీ
- ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మి
- అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీ ధీరజ్
- సీఐడీ ఎస్పీగా శ్రీదేవిరావు చక్రవర్తి
- లీగల్, హ్యూమన్‌రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్‌రావు,
- స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీగా అంబురాజన్ బదిలీ