ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే పలు మార్లు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు చాలా పుస్తకాలు చదివానని.. దానివల్ల తనకు అన్ని విషయాల్లోనూ అవగాహ న ఉందని తెలిపారు. అయితే.. ఈ వ్యవహారం ట్రోల్స్‌కు కూడా దారితీసింది.
అయినా.. పవన్ తగ్గలేదు. తాను చదివిన విషయాన్ని తనకు పుస్తకాల పట్ల ఉన్న ప్రేమను ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన పంచుకుంటున్నారు. తాజాగా ఆయన 10 లక్షల రూపాయలతో పుస్తకాలు కొనుగోలు చేశారు.