Political News

నారా ఫ్యామిలీ కుప్పం ప‌ర్య‌ట‌న వెనుక‌.. రీజ‌న్ తెలుసా..!

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు అనూహ్యంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించారు. వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించ‌డం చ‌ర్చ‌నీయాంశం. సాధార‌ణంగా ఒక ఎమ్మెల్యేగా త‌న నియోజ‌క‌వ‌ర్గం గురించి ప‌ట్టించుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, సీఎం స్థానంలో ఉన్న చంద్ర‌బాబు ఇలా.. తొలినాళ్ల‌లోనే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజులు తిష్ఠ‌వేసి మ‌రీ.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం వెనుక ఖ‌చ్చితంగా రీజ‌న్ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

1) నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు. 2) స్థానికంగా జ‌రుగుతున్న రాజ‌కీయ మార్పులు. ఈ రెండు కార‌ణంగానే చంద్ర‌బాబు అనూహ్యంగా ఇక్క‌డ ప‌ర్య‌టించారు. భారీ ఎత్తున ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్టారు. నిజానికి వారం రోజుల కింద‌టే సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి మూడు రోజుల పాటు అక్క‌డే ఉన్నారు. ప‌లు మండ‌లాల్లో ప‌ర్య‌టించి.. అనేక కార్య‌క్ర‌మాల‌కు ఆమె కూడా శ్రీకారం చుట్టారు. ఇలా.. భార్య‌, భ‌ర్త కేవ‌లం వారం వ్య‌వ‌ధిలోనే త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు పెరిగాయి. ఆధిప‌త్య పోరు సాగుతోంది. కీల‌క నాయకుల‌కు – క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు కూడా ప‌డ‌డంలేదు. గ‌తంలోనూ ఈ స‌మ‌స్య వ‌చ్చింది. ఇదే.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చింద‌న్న ప్ర‌చారం ఉంది. అందుకే ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబు అలెర్టు అయ్యారు. అందుకే.. ఆయ‌న నేరుగా జోక్యం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పైకి ఏమీ మాట్లాడ‌క పోయినా.. త‌నే స్వ‌యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్న న‌మ్మ‌కం వ‌చ్చేలా చేశారు.

ఇక‌, నారా భువనేశ్వ‌రి కూడా వారం కింద‌ట మూడు రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌దిరిగారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల మేర‌కు ఆమె ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మ‌హిళా సంఘాల‌కు సంబంధించికూడా.. ప‌థ‌కాల‌ను అమ‌లు చేయనున్న‌ట్టు తేల్చారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. గ‌తానికి ఇప్ప‌టికి మ‌ధ్య స్థానికంగా జ‌రుగుతున్న రాజ‌కీయ మార్పులు స‌రిదిద్దడంతోపాటు.. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా వ‌స్తున్న మార్పుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నంగానే ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on January 8, 2025 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లాయర్లు దూరాన కూర్చుంటే ఓకే… కేటీఆర్ కు హైకోర్టు షాక్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు…

24 minutes ago

ఇకపై ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవు!

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడతామని విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ చెప్పిన…

59 minutes ago

ఊహించని ట్విస్టు – వార్ 2 VS కూలీ ?

పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…

1 hour ago

రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం సంపూర్ణ భరోసా

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ…

2 hours ago

త‌మ్ముళ్లు వ‌ర్సెస్ త‌మ్ముళ్లు: ఎవ‌రూ స‌రిగా లేరు.. !

టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.. స‌ర్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. సాధార‌ణంగా…

3 hours ago

విశాల్ ఆరోగ్యం వెనుక అసలు నిజం

ఇటీవలే చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అభిమానులు కాని వాళ్ళు…

3 hours ago