Political News

ఇక‌, హైడ్రా పోలీసు స్టేష‌న్‌.. 24 గంట‌లూ ప‌నే!

తెలంగాణ రాజ‌కీయాల‌ను సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా ఓ కుదుపు కుదిపేసిన ‘హైడ్రా’ వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరిగిన విష‌యం తెలిసిందే. భాగ్య న‌గ‌రాన్ని సుంద‌ర నంద‌న‌వ‌నంగా మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా మూసీ న‌ది ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించేందుకు రేవంత్ రెడ్డి స‌ర్కారు న‌డుం బిగించింది. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది జూన్‌లో హైడ్రా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. అనంత‌రం.. నెల రోజుల త‌ర్వాత ప‌ని ప్రారంభించింది. అనేక మంది ప్ర‌ముఖుల ఇళ్ల‌తోపాటు అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూడా కూల్చి వేశారు. ఆ త‌ర్వాత‌.. పేద‌ల నివాసాల‌పైనా దాడులు జ‌రిగాయి.

ఈ క్ర‌మంలోనే అనేక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ సీఎం రేవంత్ రెడ్డి వెన‌క్కి త‌గ్గ‌క పోగా హైడ్రాకు మ‌రిన్ని అధికారాల‌ను క‌ట్ట‌బెట్టారు. దీనికి సంబంధించి ‘జీహెచ్ఎంసీ చట్టం 1955’ను సైతం సవరించారు. చెరువులు, ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో సెక్ష‌న్ 374 బీని చేర్చారు. ఈ క్ర‌మంలో హైడ్రాకు మ‌రిన్ని విస్తృత అధికారాలు ద‌ఖ‌లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత‌.. కొంత నెమ్మ‌దించిన హైడ్రా.. ఇటీవ‌ల మ‌ళ్లీ ప‌నులు ప్రారంభించింది. అన‌ధికార క‌ట్ట‌డాల కూల్చివేత‌ల‌పై కొన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు నిర్దేశించుకున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

ఇక‌, ఇప్పుడు హైడ్రాకు సంబంధించి ప్ర‌త్యేకంగా ఓ పోలీసు స్టేష‌న్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం పొద్దు పోయాక ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బుద్ధ భ‌వ‌న్‌లోని బీ బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా అవ‌కాశం క‌ల్పిస్తూ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. దీంతో హైడ్రాకు తొలిసారి ఓ పోలీసు స్టేష‌న్ అందుబాటులోకి రానుంది. ఇది 24 గంట‌లూ ప‌నిచేయ‌నుంది. ఎవ‌రైనా స‌రే.. ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ఈ స్టేష‌న్‌లో నమోదు చేసుకోవ‌చ్చు. అదేవిధంగా వారికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను కూడా వివ‌రిస్తూ.. విన్న‌వించుకోవ‌చ్చు. ఈ స్టేష‌న్ కూడా సాధార‌ణ పోలీసు స్టేష‌న్ లాగానే ఫిర్యాదులు స్వీక‌రించ‌నుంది. అయితే.. ప్ర‌త్యేక అధికారాల మేర‌కు ప‌నిచేయ‌నుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు.

This post was last modified on January 8, 2025 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీనాక్షిని మార్చేసిన ఒక్క ట్రోలింగ్

ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా…

40 minutes ago

లాయర్లు దూరాన కూర్చుంటే ఓకే… కేటీఆర్ కు హైకోర్టు షాక్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు…

2 hours ago

ఇకపై ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవు!

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడతామని విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ చెప్పిన…

2 hours ago

ఊహించని ట్విస్టు – వార్ 2 VS కూలీ ?

పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…

3 hours ago

రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం సంపూర్ణ భరోసా

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ…

4 hours ago

త‌మ్ముళ్లు వ‌ర్సెస్ త‌మ్ముళ్లు: ఎవ‌రూ స‌రిగా లేరు.. !

టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.. స‌ర్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. సాధార‌ణంగా…

4 hours ago