Movie News

ఆలూ లేదు చూలూ లేదు… చిరు, నానికి లింకు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఇలాంటి నవతరం దర్శకులతో చిరు పని చేయాలని, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ఈ కాంబినేషన్ విషయంలో ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా టైం పట్టేలా ఉంది. చిరు ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లితో ఒక సినిమాను మొదలుపెట్టాడు. మరోవైపు ‘విశ్వంభర’ సంగతేంటో తేల్చాల్సి ఉంది.

మరోవైపు శ్రీకాంత్ చాలా కాలంగా ‘ది ప్యారడైజ్’ సినిమాలో స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. మార్చిలో రావాల్సిన సినిమా ఆగస్టుకు వాయిదా పడింది. కానీ కొత్త డేట్‌కు అయినా రిలీజవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారం జరగట్లేదని తెలుస్తోంది. ఐతే ‘ది ప్యారడైజ్’ సంగతేంటో తేలకముందే.. ఈ సినిమాకు, చిరుతో శ్రీకాంత్ చేయబోయే చిత్రానికి కనెక్షన్ ఉందని.. ఈ సినిమాలో ఆ చిత్రానికి లీడ్ ఇస్తారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

‘ది ప్యారడైజ్’ లాంటి రా అండ్ రస్టిక్ మూవీతో చిరు చిత్రానికి లింకా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం నాని సినిమాకు, చిరు చిత్రానికి కనెక్షన్ ఏమీ ఉండదని తెలుస్తోంది. అసలు చిరు సినిమాకు ఇప్పటిదాకా కథ రెడీనే కాలేదు. జస్ట్ ఒక లైన్ అనుకున్నారు. అది కూడా ఫైనల్ అనుకోవడానికి లేదు. ‘ది ప్యారడైజ్’ పూర్తి చేశాక శ్రీకాంత్ తన రైటింగ్ టీంతో కూర్చుని కథ డెవలప్ చేస్తాడు. తర్వాత చిరు ఆమోద ముద్ర వేశాక సినిమా ముందుకు కదులుతుంది.

అసలు చిరుతో ‘ది ప్యారడైజ్’ స్థాయిలో రా అండ్ రస్టిక్ సినిమా చేసే అవకాశాలు తక్కువ. నానితో అంటే ఓకే కానీ.. మెగాస్టార్‌తో అలా ట్రై చేస్తే అది ఓవర్ ద బోర్డ్ వెళ్లినట్లు అనిపించొచ్చు. చిరును కొత్తగా చూపించాలనే అభిమానులు ఆశిస్తారు కానీ.. లైన్ దాటి మరీ పక్కకు వెళ్లినా కష్టమే. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదనే తెలుస్తోంది. ముందు శ్రీకాంత్ ‘ది ప్యారడైజ్’ను ఎప్పుడు పూర్తి చేస్తాడన్నది చూడాలిప్పుడు.

This post was last modified on June 2, 2026 2:38 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

8 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago