Movie News

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు అనేకం. అలా ఓపెన్ చేయడం వల్ల సోషల్ మీడియా కాలంలో లేనిపోని తలనెప్పులు వస్తాయనే ఉద్దేశంతో ఈ టాపిక్ జోలికి పోరు. కాకపోతే బయట రకరకాల నెంబర్లు తిరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజాలు లేకపోలేదు. అలాంటి టైంలో ప్రొడ్యూసర్లు వాటిని ఖండించిన దాఖలాలు కూడా తక్కువే. అయితే బుచ్చిబాబు దీనికి భిన్నంగా వెళ్లిపోయారు.

నిన్న విజయవాడలో జరిగిన పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఉప్పెన 25 కోట్లలో తీశానని, కానీ పెద్దికి 350 కోట్ల దాకా అయ్యిందని అంత పెద్ద వేదిక మీద చెప్పేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్యాన్ ఇండియా స్థాయిలో దీనికి ఖర్చు పెట్టారని తెలుసు కానీ విజువల్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఇలాంటి విలేజ్ డ్రామాకు ఇంత మొత్తం ఊహించనిది. అంటే దర్శకుడిగా రెండో సినిమాకే పధ్నాలుగు రెట్ల బడ్జెట్ పెరిగిపోయిందన్న మాట.

ఇప్పుడీ మాటతో బుచ్చిబాబు మీద అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. రేపు రాత్రి వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పెరిగింది. ఇంటర్వ్యూలలోనే కాదు స్టేజి మీద కూడా బుచ్చిబాబు చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. క్యూబ్ తదితర మాధ్యమాల్లో చూసినవాళ్లు ప్రశంసలు అందించారని బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇది కంటెంట్ మీద నమ్మకంతో చేసేదే అయినా హైప్ ఎక్కువగా ఉన్న ఇలాంటి టైంలో ఇంత పెద్ద స్టేట్ మెంట్లు ఇవ్వడం రిస్కే.

టీమ్ చాలా ధీమాగా ఉంది. ఎంతైనా ఊహించుకోండి అంతకంతా పెద్ది మిమ్మల్ని మెప్పిస్తుందనే ఫీలింగ్ అందరిలోనూ కనిపిస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పబ్లిసిటీలో భాగమైపోయి తమ వంతుగా ఎంత చేయాలో అంతా చేశారు. భోపాల్, బెజవాడ ఈవెంట్లను ఇంత ఘనంగా నిర్వహించడం ద్వారా నిర్మాత తన వైపు నుంచి పూర్తి కంట్రిబ్యూషన్ ఇచ్చేశారు. ఇక మిగిలింది కంటెంట్ మాట్లాడ్డమే. రేపు అర్ధరాత్రికి ప్రేక్షకుల తీర్పు తెలిసిపోనుంది.

This post was last modified on June 2, 2026 10:48 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

44 minutes ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

9 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

10 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago