Movie News

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్లు వచ్చే వరకు గ్లామర్ రోల్స్ తో బిజీగా ఉంటారు. ఆ వయసు దాటాక ఆఫర్లు మెల్లగా తగ్గిపోతుంటాయి. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేసి లాంగ్ రన్ లో నిలబడాలని అనుపమ పరమేశ్వరన్ ఒక సరికొత్త రూట్ లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
కెరీర్ మొదట్లో ప్రేమమ్, శతమానం భవతి లాంటి సినిమాలతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకుంది.

అయితే అమ్మడి క్యూట్ నెస్ తోనే ఇంకో నాలుగైదేళ్లు ఈజీగా నెట్టుకురావచ్చు. కానీ 30 ఏళ్లు దాటాక అదే ఇమేజ్ కంటిన్యూ చేస్తే కొత్త హీరోయిన్ల పోటీలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేవలం గ్లామర్ మీద ఆధారపడకుండా, నటనకు స్కోప్ ఉన్న పాత్రల వైపు ఫోకస్ మార్చింది. విద్యాబాలన్, టబు లాంటి సీనియర్లు ముందే ట్రాక్ మార్చుకున్నారు కాబట్టే ఇప్పటికీ లీడ్ రోల్స్ దక్కించుకుంటున్నారు. ఇప్పుడు అనుపమ కూడా అదే దారిలో నడుస్తోంది.

గత రెండేళ్లుగా అనుపమ ఎంచుకుంటున్న కథలు చూస్తే ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ స్పష్టంగా అర్థమవుతుంది. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత కమర్షియల్ ఆఫర్లు చాలానే వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టింది. పరదా, లాక్ డౌన్, మరీచిక లాంటి లేడీ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుంది. ముఖ్యంగా ‘మరీచిక’లో వెంకటలక్ష్మి క్యారెక్టర్ లో చేసిన ప్రయోగానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి క్యారెక్టర్స్ ఎంచుకోవడం వెనుక కొంత రిస్క్ కూడా లేకపోలేదు. కమర్షియల్ సినిమాలు వదిలేస్తే మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది.

‘కిష్కిందపురి’ మినహా మిగతా ప్రయోగాత్మక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే తాత్కాలిక హిట్ల కోసం కాకుండా, నటిగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ ప్రయోగాలు కంటిన్యూ చేస్తోంది. సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి వాళ్లు కేవలం గ్లామర్ తోనే కాకుండా తమ టాలెంట్ తోనే ఇండస్ట్రీలో నిలబడ్డారు.

ఇప్పుడు అనుపమ కూడా ఆ రూట్ నే ఫాలో అవుతోంది. 30 ఏళ్ల వయసులోనే ఇమేజ్ మార్చుకుని భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకుంటోంది. కమర్షియల్ గా కొన్ని సినిమాలు వర్కౌట్ కాకపోయినా, క్రిటిక్స్ మెప్పు పొందితే భవిష్యత్తులో బలమైన పాత్రలు దక్కుతాయని నమ్ముతోంది.

This post was last modified on June 1, 2026 9:45 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

42 minutes ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

6 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

10 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

11 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

12 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

13 hours ago