పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక, సమయానికి అనుమతులు రాక నిర్మాతలు టెన్షన్ పడుతుంటే, ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి సారించలేక, కోర్టుల నుంచి హఠాత్తుగా వచ్చే అక్షింతలు భరించలేక అటు గవర్నమెంట్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయినా సరే అంతులేని కథలా ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఇప్పుడీ టాపిక్ కి కారణం పెద్ది అని వేరే చెప్పనక్కర్లేదు.
రేపు రాత్రి ప్రీమియర్లు వేయాలి. ఇప్పటిదాకా జీవో లేదు. నిర్మాత ఎదురు చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లేమో ఆల్రెడీ అమలులో ఉన్న గరిష్ట ధర ప్రకారం వెళ్ళిపోదామని అడుగుతున్నారు. మధ్యలో ఏ నిర్ణయం వెలువడటం లేదు. ఏ క్షణమైనా ఉత్తర్వులు రావొచ్చని టీమ్ నమ్మకంతో ఉండగా అంత ఈజీగా ఇది తేలదని బయ్యర్లు భావిస్తున్నారు. ఆ మధ్య రాజా సాబ్ టైంలో ఎంత రాద్ధాంతం జరిగిందో తెలిసిందే. విమల్ థియేటర్ దగ్గర పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
త్వరలోనే ఈ ప్రక్రియకు సరైన దిశానిర్దేశం రావాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది. ఎందుకంటే టయర్ 1 హీరోలందరూ ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. విశ్వంభర, సంబరాల ఏటిగట్టు, వారణాసి, డ్రాగన్, రాకా, ప్యారడైజ్ లాంటివి వందల కోట్ల పెట్టుబడితో పెద్ద రిస్కు చేస్తున్నవి. ఇది దృష్టిలో పెట్టుకుని టికెట్ పెంపు వ్యవహారాన్ని సరళతరం చేయాలని సినీ పెద్దలు అడుగుతున్నారు. గద్దర్ అవార్డులు పునరుద్ధరించినట్టే ఈ సమస్యకు కూడా పరిష్కారం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
గతంలో హైకోర్టు ఒక ఆదేశమిచ్చింది. తొంభై రోజుల ముందే నిర్మాతలు హైక్ కోసం అప్లై చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించాలని దాని సారాంశం. కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యపడటం లేదు. ఎందుకంటే చెప్పిన రిలీజ్ డేట్లకు కట్టుబడే పరిస్థితి ఏ నిర్మాతకు లేదు. పెద్ది నుంచి మా ఇంటి బంగారం లాంటి మీడియం బడ్జెట్ సినిమా దాకా అందరిదీ అదే పరిస్థితి. దీనికి ముగింపు దొరకాలంటే పెద్దలు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ నడుం బిగించాలి. లేదంటే స్టోరీ రిపీట్ అవుతూనే ఉంటుంది.
This post was last modified on June 2, 2026 3:14 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…