ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వివాదాలకు కడు దూరంగా ఉంటున్నారు. నిజానికి నగరి నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న రోజా.. ఫైర్ అన్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో అభివృద్ధి కంటే.. ఆమె మాటల ద్వారానే.. ఎక్కువగా మీడియా ముందుకు వచ్చారు. వివాదాలకు కేంద్రంగా మారారు.
కానీ, తొలిసారి విజయం దక్కించుకున్న భాను మాత్రం ఎంతో సౌమ్యంగా ప్రజలకు చేరువయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ప్రజలను ఆయన పట్టించుకున్న తీరు.. ఆయనకు విజయం సాధించి పెట్టింది. అందరినీ కలుపుకొని పోవడం.. ప్రతిసమస్యపైనా దృష్టి పెట్టడం వంటివి భానుకు కలిసి వస్తున్నాయి. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఎమ్మెల్యే అయినా.. కూడా ఎక్కడా ఆధిపత్య రాజకీయాలు చేయడం కానీ.. రోజాపై విమర్శలు చేయడం కానీ.. చేయడం లేదంటే ఆయన ఎంత సౌమ్యంగా ఉన్నారో అర్థమవుతుంది.
అంతేకాదు.. నియోజకవర్గంలో పెండింగు ఉన్న పనులను కూడా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నా రు. వాస్తవానికి గతంలో రోజా ఏ పనిచేసినా.. ప్రచారం చేసుకునేవారు. తర్వాత పని చేసేవారు. కానీ, భాను మాత్రం ఎక్కడా ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నెలకు మూడు సార్లు.. అమరావతికి వస్తున్నారు. నియోజకవర్గంలో చేస్తున్న పనులను సీఎం సహా మంత్రి నారా లోకేష్‌కు వివరిస్తున్నారు. తనకు కావాల్సిన నిధులను అడుగుతున్నారు.
ఇక, రాజకీయ పరంగా మాత్రం ఆయన దూకుడుగా కాకుండా.. ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఎవరి పని వారిని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎవరితోనూ కయ్యానికి పోకుండా.. ఎవరిపైనా దూకుడు లేకుండా ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకంగా ప్రజాదర్బార్‌లు పెట్టరు. నిరంతరం.. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తనకు ఎవరు ఫోన్ చేసి చెప్పినా.. సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే.. యువ ఎమ్మెల్యేగా ఆయన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates