వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఆస్తుల విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రహస్యంగా ఉంచిన షర్మిల రాసిన ఉత్తరాలను జగన్.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు చేరవేశారు. వీటిని కూడా కేసు విచారణకు పరిగణనలోకి తీసుకోవాలన్నది జగన్ ఉద్దేశం. ఆమేరకు తన న్యాయవాదులతో వాదనలు కూడా వినిపించారు. దీంతో ఎన్ సీఎల్టీ సదరు ఉత్తరాలను పరిగణనలోకి తీసుకుంది.
దీని ప్రకారం.. షర్మిల రాసినట్టుగా చెబుతున్న ఉత్తరాల్లో తండ్రి వైఎస్ జీవించి ఉన్నప్పుడే.. ఆస్తులను పంచేశారని.. ఉందన్న వాదనలు జగన్ తరఫు న్యాయవాది ట్రైబ్యునల్‌కు చెప్పారు. దీనిని ట్రైబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. అంటే.. ఇప్పుడు వివాదం జరుగుతున్న సరస్వతి పవర్‌కు సంబంధించిన వాటాలు.. అన్నీ కూడా.. ప్రేమతో తాను ఇచ్చినవేనని జగన్ మరోసారి ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించినట్టు అయింది.
ఈ పరిణామాలతో ఇప్పుడు ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ట్రైబ్యునల్ ఎలా స్పందిస్తుంద న్నది కూడా.. ముఖ్యంగా మారింది. అయితే. వాస్తవానికి అన్నకు రాసిన ఉత్తరాలను రహస్యంగా ఉంచాల్సిన జగన్.,. ఇలా బహిర్గతం చేయడం అంటే.. షర్మిలకు ద్రోహం చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందన్నది వైఎస్ అనుచరులు చెబుతున్నారు. కానీ, న్యాయ పోరాటంలో ఎవరైనా తమను తాము కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలుచేస్తారని.. కాబట్టి ఈ ఉత్తరాలు వెలుగులోకి తెస్తే.. తప్పులేదన్నది జగన్ వైపు న్యాయవాదుల వాదన.
వెరసి..ఇప్పుడు కీలకమైన ఆస్తుల వివాదంలో ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పు, లేదా ఆదేశాలు అత్యంత కీలకంగా మారాయి. నిజానికి షర్మిల చెబుతున్న వాదన సరైందే అయితే..(అంటే సరస్వతి భూములను మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని.. షేర్లు కాదని) ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates