మంత్రుల పై చంద్రబాబు సీరియస్..రీజనిదే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది.

మంత్రులు స్పీడ్ పెంచాలని, సమర్థవంతంగా పనిచేయాలని చంద్రబాబు సున్నితంగా క్లాస్ పీకారని తెలుస్తోంది. ఇక నుంచి ప్రతిరోజు ఎంతో ముఖ్యమైందని, మంత్రులు కూడా తనతో సమానంగా పనిచేయగలరని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది.

చాలామంది మంత్రులు ఇంకా నిర్లిప్తంగా ఉన్నారని, ఇలా ఉంటే పనిచేయలేరని చంద్రబాబు కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది. మంత్రులు క్రియాశీలకంగా పనిచేయాలని, ప్రో యాక్టివ్ గా ఉండాలని ఆయన స్పష్టం చేశారట.

కొందరు మంత్రుల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని మంత్రులకు ఆయన దిశా నిర్దేశం చేశారట.

ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారట. డ్రోన్ షో అద్భుతంగా జరిగిందని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం హర్షణీయమని చంద్రబాబు అన్నారట.

ఫింఛన్లకు కొత్త లబ్ధిదారులు, అనర్హులంటూ గత ప్రభుత్వంలో తొలగించిన పింఛన్లపై చర్చించిన చంద్రబాబు…వాటిపై గ్రామ సభల్లో తగు చర్యలు తీసుకోవాలని చెప్పారట. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.