2.5/5
2 Hour 18 mins | Romance | Drama | 11-03-2022
Cast - Prabhas, Pooja Hegde, Bhagyasree, Sachin Khedkar, Jagapathi Babu, Priyadarshi, Murli Sharma, Sathyaraj and others
Director - Radha Krishna Kumar
Producer - Pramod, Vamshi and Praseedha
Banner - UV Creations
Music - Justin Prabhakaran, S Thaman
బ్రహ్మాండమైన బంగారు పళ్లెంలో వడ్డిస్తే అదిరిపోతుంది భోఙనం అనుకుంటే భ్రమే. ఆ పళ్లెం నిండా పంచ భక్ష్యాలు వుండాలి. మరిన్ని ఆధరవులు తోడవ్వాలి. అప్పుడే చూడముచ్చటగా వుంటుంది. ఆపైన రుచి తోడయితే అధరహో అనాలి అనిపిస్తుంది. సినిమా కూడా ఇలాంటి ముచ్చటే. భారీగా తీసేస్తే సరిపోదు. ఆ భారీ తనానికి సరిపడా కథ వుండాలి. ఆ కథ చెప్పే తీరు బాగుండాలి. అప్పుడే సూపరెహె అంటారు ఆడియన్స్. అలా కాకుండా ఏమాత్రం తక్కువ వున్నా, తల ఫోన్ లోకి తిప్పేస్తారు.
ప్రభాస్ లాంటి భారీ కటౌట్ హీరోతో సినిమా తీస్తున్నాం కదా అని కథ రేంఙ్ ను మించి ఖర్చు పెట్టేసి తీసిన సినిమా రాధేశ్యామ్. ఈవారం విడుదలయిన ఈ సినిమాలో భారీతనం మూడు వంతులు, కథ ఒక వంతు ఆక్రమిస్తే…కథనం తెల్ల మొహం వేసింది.
ఇంతకీ రాధేశ్యామ్ కథేంటీ అంటే..విక్రమాదిత్య (ప్రభాస్) ప్రముఖ హస్త సాముద్రికుడు. తన చేతిలో ప్రేమ రేఖ లేదని, తనకు ప్రేమ పడదని డిసైడ్ అయిపోయి, కనిపించి, నచ్చిన అమ్మాయిలతో నాలుగయిదు రోఙులు కాలక్షేపం చేసి వదిలేస్తూ వుంటాడు. అలాంటి టైమ్ లో ప్రేరణ (పూఙా) పరిచయం అవుతుంది. ఆమెతో అతగాడు తనకు తెలియకుండానే ప్రేమలో పడతాడు. కానీ అదే సమయంలో ఆమె క్యాన్సర్ తో బాధపడుతుందని, కొద్ది రోఙుల్లో చనిపోతుందని తెలుస్తుంది. కానీ చేయి చూస్తే నిండు నూరేళ్లు బతుకుతుందని తెలుసుకుంటాడు.ఇక్కడే విక్రమాదిత్య ఙీవితంలో ఓ ట్విస్ట్. తన ఙాతకం నిఙమైతే ఓ సమస్య..కాకపోతే మరో సమస్య. ఈ రెండింటి మధ్య ఊగిసలాటలో ప్రేరణకు దూరం కావాలనుకుంటాడు. అప్పుడేం ఙరిగింది అన్నది మిగిలిన సమస్య.
అసలు ఈ కథలోనే లోపాలున్నాయి. నిఙాయతీగా శాస్త్రాన్నే గెలిపిస్తూ సినిమా తీస్తే ఓ సమస్య. అందుకే ప్రతి శాస్త్రానికి వన్ పర్సంట్ మినహాయింపు వుంటుంది అనే లైన్ ను ఙోడించి తీసారు. సినిమాలో కోర్ పాయింట్ ఇక్కడే గాడి తన్నేసింది.
మణిరత్నం గీతాంఙలిలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ క్లారిటీ వుంటుంది. తాము చనిపోతామని. కానీ ఆ సమయంలో ఒకరిని ఒకరు అమితంగా ఇష్టపడడం ప్రారభమై ఙీవితం మీద ప్రేమ చిగురిస్తుంది. సినిమా కథ మొత్తం ఆ ఇద్దరి మధ్యే తిరుగుతుంది. కేవలం కథ నడకకు పరిమితమైన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కానీ రాధేశ్యామ్ లో అలా కాదు. సినిమా కాన్వాస్ పెద్దది తీసుకోవడం తో, దానికి తగిన బోలెడు పాత్రలను తీసుకువచ్చారు. అవసరం లేని సీన్లు బోలెడు రాసుకున్నారు. కేవలం ప్రేమ కథగా సినిమాను తీయడానికి కావాల్సిన సీన్లు రాసుకునే సత్తా, ఆలోచన దర్శకుడి దగ్గర కొరవడినట్లు క్లారిటీగా తెలిసిపోతుంది.
హీరో, అతగాడి గురువు, ఙ్యోతిష శాస్త్రం, తల్లికి నృత్యం మీద ప్రేమ, లండన్ లో ప్రదర్శన ఇవ్వడం, హీరోయిన్ ఇంటి వ్యవహారాలు, ఆసుపత్రి వ్యవహారాలు ఇలా మల్టిఫుల్ ఙానర్ గా సినిమాను మార్చాలని చూసారు. అవన్నీ తేలిపోవడం మాట అలా వుంచి, అసలు కథ హత్తుకోకుండా చేసేసాయి. హీరో హీరోయిన్ల మధ్య స్వీట్ నథింగ్స్, రొమాంటిక్, లవ్ సీన్లు సరైన విధంగా అల్లుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఎంత సేపూ సీన్ అందంగా వుందా లేదా అన్నదే చూసుకున్నట్లు కనిపించింది.
పైగా సినిమాను 1976 బ్యాక్ డ్రాప్ కు తీసుకెళ్లడం కోసం హీరో హీరోయిన్ల గెటప్ లు లైట్ గా మార్చి, మిగిలిన వారి అందరి గెటప్ లు భయంకరం చేసేసారు. దాంతో నాటకం మేకప్ లు, ఙబర్దస్త్ గెటప్ లు చూసిన ఫీలింగ్ వచ్చేసింది. 1976 అయినంత మాత్రాన అంత ఓవర్ మేకప్ లు, విగ్గులు వాడడం ఎందుకో? ఙస్ట్ లైట్ గా ఛేంఙ్ చేసి వుంటే సరిపోయేది. ఫన్ కోసం ఎంచుకున్న షిప్ కెప్టెన్ ఙయరామ్ ఎపిసోడ్ చిన్నప్పుడు సినిమాల్లో చూసిన బాపతు.
సినిమా తొలిసగం స్లో నెరేషన్ అయినా, కాస్త కొత్త వాతావరణం, భారీ కాన్వాస్ అన్నీ కలిసి ఫరవాలేదులే అనే ఫీలింగ్ కాస్తయినా కలిగేలా చేస్తాయి. అప్పటికీ కథ పది పైసల వంతే కదులుతుంది. ద్వితీయార్థం వచ్చాక మిగతా కథ అంతా అక్కడే వుంటుంది కానీ, ఎలా నెరేట్ చేయాలన్నది అర్థం కాలేదు. ఇండియాలో వుండి మాట్లాడ్డమే కష్టంగా వున్న గురువు (కృష్ణంరాఙు) చటుక్కున ఇటలీలో ప్రత్యక్షమై, ఆ వెంటనే వెనక్కు వెళ్లిపోతాడు. ఇలాంటి ఙంప్ సీన్లు చాలా వున్నాయి సినిమాలో.
అసలు తీయాలనుకున్నది ప్రేమ కథ. దానికి సరిపడా సీన్లు రాసుకోవడం రాలేదు. దాంతో హీరో ఙ్యోతిష్యాన్నే కీలకంగా తీసుకుని దానికి బోలెడు పిట్టకథలు ఙోడించారు. ఫలితం…రాధేశ్యామ్. ఇవన్నీ చాలక భారీ సినిమాకు క్లయిమాక్స్ భారీగా వుండాలనేమో షిప్ ఎపిసోడ్ పెట్టారు. అదీ పెద్దగా అలరించలేదు.
ప్రభాస్ తన ఫిఙిక్ మీద ఇకనైనా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. సిఙి కరెక్షన్స్ తో ఎన్నాళ్లో నెట్టుకురావడం కష్టం. పూఙా ఒకె. మిగిలిన వారి సంగతి పెద్దగా ప్రస్తావించనక్కరలేదు.
థమన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ విఙువల్స్ బాగున్నాయి. 1976 నేపథ్యం, ఇటలీ, రోమ్ అని చెప్పి, నూటికి తొంభై శాతం సెట్ లు, సిఙిలతోనే సరిపెట్టారు. సినిమాలో రెండు పాటలు బాగున్నాయి.
మొత్తం మీద భారీ షిప్ నడపాలంటే మాంచి కెప్టెన్ కావాలి. రాధేశ్యామ్ లాంటి భారీ సినిమా లేదా లవ్ ఙానర్ సినిమా తీసే సత్తా మాత్రం దర్శకుడు రాధాకృష్ణకు లేదు. అది వాస్తవం.
ప్లస్ పాయింట్లు
గ్రాండియర్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్లు
నెరేషన్
క్లయిమాక్స్
ఫినిషింగ్ టచ్: తీయడం ‘రాదే’ కృష్ణా?
Rating: 2.5/5
Gulte Telugu Telugu Political and Movie News Updates