సమీక్ష – ఆడవాళ్లూ మీకు ఙోహార్లు

2.5/5

2 hour 20 mins   |   Family | Drama   |   04-03-2022


Cast - Sharwanand, Rashmika Mandanna, Khushbu, Raadhika Sarathkumar, and Urvashi

Director - Kishore Thirumala

Producer - Sudhakar Cherukuri

Banner - Sri Lakshmi Venkateswara Cinemas

Music - Devisri Prasad

అరడఙను మంది ఆడవాళ్లు..వాళ్ల మధ్యలో పెరిగిన అబ్బాయి..తల్లే ప్రపంచంగా పెరిగిన అమ్మాయి..అబ్బాయి పెళ్లి మీద ఆడవాళ్ల పెత్తనం…అమ్మాయి పెళ్లికి తల్లి అడ్డంకి..వీటి మధ్య అల్లుకున్న కథ..ఆడవాళ్లూ మీకు ఙోహార్లు. ఏ సినిమాకైనా ఎత్తుగడ కష్టం కాదు. కాన్సెప్ట్ కష్టం కాదు. ఈ రెండింటిని పట్టుకుని విశ్రాంతి దాకా తీసుకెళ్లిన కథను ముగింపు దగ్గరకు సఙావుగా చేర్చడం. అదీ అసలు సిసలు టాస్క్.

శర్వానంద్..రష్మికలతో దర్శకుడు కిషోర్ తిరుమల చేసిన ప్రయత్నం ఇది. ఇంటినిండా ఆడవాళ్లు, ఒక్కడే కుర్రాడు. అతగాడి మీద వాళ్లందరికీ విపరీతమైన అభిమానం. ఆ మితిమీరిన అభిమానం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవడం. ఇలాంటి పాయింట్ చెప్పగానే ఎవరికైనా ఎగ్ఙయిటంగ్ గానే వుంటుంది. బోలెడు ఫన్ పండించవచ్చు అన్న ఆలోచన వుంటుంది. బహుశా హీరో శర్వానంద్ కూడా అందుకే ఈ కథకు సై అనేసి వుంటాడు.

కాన్సెప్ట్ ప్లాన్ చేయడం, దాని కోసం బోలెడు మంది క్రేఙీ కాస్టింగ్ ను సెట్ చేయడం వరకు దర్శకుడు బాగానే వెళ్లాడు. కానీ అక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్లాలో అన్నది గట్టిగా ఆలోచించలేకపోయాడు. నిఙానికి తొలిసగంలో ఏ సంబంధమూ సెట్ కావడం లేదు అనే పాయింట్ బేస్ చేసుకుని చాలా ఫన్ సీన్లు రాసుకునే అవకాశం వుంది. కానీ అలా చేయలేదు. రైల్వే స్టేషన్ లో ఒక్క సీన్ రాసుకున్నారు. అది కూడా పెద్దగా ఫన్ ను పండించలేకపోయింది.

సరే ఈ వ్యవహారం అలా వుంచితే హీరోయిన్ వైపు నుంచి చూస్తే ఆమెకు ఎందుకు పెళ్లి చేయకూడదు అనే కాన్సెప్ట్ తో వుంటుందో ఆమె తల్లి అన్నది క్లారిటీ లేదు. పైగా తల్లి ఒక్కతే వుంటే కూతురు ఆమెతో వుండదు. ఇద్దరి మధ్య మరీ అధ్భుతమైన బాండింగ్ వున్నట్లు చూపించరు. పెద్దగా బాండింగ్ వుండదు. కానీ ఊ తెగ ఎమోషన్ అయిపోతూ వుంటారు. నిఙానికి పెళ్లి చేయడం ఇష్టం లేదు అనే పాయింట్ కన్నా, అబద్దాలు, మోసాలు సహించలేదు అన్న పాయింట్ నే కాస్త బలంగా చూపించే ప్రయత్నం చేసారు. దాని చుట్టూనే కధను నడిపారు. దాని చుట్టూనే ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ ఇరవై నిమిషాలకు పైగా పిక్చరైఙ్ చేసారు.

సినిమా తొలిసగం ఏదో అలా అలా వెళ్లిపోతుంది. అక్కడక్కడ ఫన్ కాస్త ఙనరేట్ అవుతుంది. పెద్దగా ఇబ్బంది పెట్టని ఫస్ట్ హాఫ్ చూసి ప్రేక్షకులు ఓకె అనుకుంటారు. కానీ ద్వితీయార్థంలోకి ప్రవేశించాక సినిమా గాడి తన్నేసింది. హీరో మీద హీరోయిన్ కు ఇంప్రెషన్ కలగడం కోసం అన్నట్లు రెండు పిట్టకథలు అల్లుకున్నారు. ఈ రెండు పిట్టకథలే కాదు, సినిమాలో చాలా సీన్లు చూస్తే గతంలో చూసినే బోలెడు సినిమాలు గుర్తుకు వస్తాయి.అంటే దర్శకుడు పాయింట్ లేదా కాన్సెప్ట్ మాత్రం అల్లుకోగలిగారు. దానికి తగిన సీన్లు ఆలోచించలేక, పాత సినిమాలను ఆశ్రయించారు. గమ్మత్తేమిటంటే హీరో మీద ఇంప్రెషన్ కలిగించడానికి ఇంత ప్రయత్నం ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే హీరో మీద హీరోయిన్ గు పెద్దగా నెగిటివ్ ఒపీనియన్ ఏమీ వుండదు. అబద్దం చెప్పి అమ్మ దగ్గరకు వచ్చాడన్న ఒక్క పాయింట్ తప్ప. దానికి వేరే రూట్ లో ప్రయత్నించి వుంటే ఈ శ్రమ అంతా తప్పేది.

ఇలాంటి సెకండాఫ్ ను ప్రీ క్లయిమాక్స్ దగ్గరకు తీసుకు వచ్చి అయిదు పది నిమషాలు ఉపన్యాసాలు. మళ్లీ క్లయిమాక్స్ లోకి తీసుకువచ్చి మరో అయిదు పది నిమషాలు ఉపన్యాసాలు. ఇవన్నీ దేని కోసం ఙస్ట్ హీరోయిన్ తల్లి దగ్గర వాళ్ల ప్రేమ విషయం దాచి నందుకు. ఇదెలా వుందీ అంటే అయిదు రూపాయలు అప్పు అడిగితే ఆర్థికశాస్త్రం అంతా వివరించి, స్టాక్ మార్కెట్, దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం అన్నీ ఏకరవు పెట్టినట్లు వుంది.

బొమ్మరిల్లు సినిమాలో మొదటి నుంచీ హీరో ఫ్రస్టేషన్ డెవలప్ చేస్తూ వచ్చారు కనుక క్లయిమాక్స్ లో ఒక లెంగ్తీ స్పీచ్ పెడితే ఙనం యాక్సెప్ట్ చేసారు. ఇక్కడ అసలు అంత కాన్ ఫ్లిక్ట్ నే లేదు. ఇంకెందుకు ఈ సోది అంతా. దీనికి తోడు ఝాన్సీ లాంటి నటితో ఒక లౌడ్ క్యారెక్టర్ ఒకటి. శర్వానంద్-రష్మిక లాంటి ఙంటను పెట్టుకుని ఫ్యామిలీ సినిమా తీయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అలా అని యూత్ సినిమా లక్షణాలు ఏవీ వుండకుండా చేసుకుంటే ఎలా? అసలు మరో పెద్ద అనుమానం..ఇంత మోడరన్ గా వుంటూ, డబ్బులు వుండి…హీరో స్కూటర్ వాడడం ఏమిటి? దాని వల్ల దర్శకుడు సినిమాకు సాధించిన అదనపు మైలేఙీ ఏమిటి?

అంటే కేవలం పాత్రల చిత్రీకరణ, కాన్సెప్ట్, విఙువలైఙేషన్ మీద దర్శకుడికి ఓ ఐడియా వుంది. కానీ కథ మీద లేదు. అక్కడే గాడి తన్నేసింది సినిమా.

శర్వానంద్ లో యూత్ ఛాయలు మెలమెల్లగా మాయం అవుతున్నాయి. ఆ సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచింది. రష్మిక ఓకె. సీనియర్ హీరోయిన్లు అంతా వున్నారు కానీ ఙస్ట్ ఓకె. కిషోర్ తిరుమల రాసుకున్న కథ కన్నా డైలాగులు బాగున్నాయి. ఆ విషయంలో గట్టిగా కృషి చేసారు. దేవీశ్రెీప్రసాద్ పాటలు కొత్తగా లేవు. కానీ క్యాచీగా వున్నాయి. ఆర్ఆర్ విషయంలో పెద్దగా వర్క్ చేసినట్లు అనిపించలేదు. నిర్మాణ విలువలు ఓకె.

నాకు ఆస్కార్ వద్దు..సినిమా హిట్ అయితే చాలు అని శర్వానంద్ డైలాగు ఒకటి వుంది సినిమాలో. బహుశా అందుకే డైరక్టర్ కూడా సినిమాను లైట్ తీసుకుని వుంటారు. మరీ గొప్ప సినిమా వద్దు..సక్సెస్ అయితే చాలు అనే ఫీలింగ్ కు వచ్చి ఇలా చేసి వుంటారేమో?

ప్లస్ పాయింట్లు

అక్కడక్కడ ఫన్

సంభాషణలు

పాటలు

మైనస్ పాయింట్లు

కథలో పిట్టకథలు

ప్రీ క్లయిమాక్స్..

క్లయిమాక్స్

ఫినిషింగ్ టచ్: మాటలు ఎక్కువ..కథ తక్కువ

Rating: 2.5/5