మళ్లీ తనకో సినిమా చేసి పెడతానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడని బండ్ల గణేష్ చెప్పుకున్నాడు. ఏ సినిమా తీసేదీ, ఎప్పుడు తీసేదీ అతనేమీ చెప్పలేదు. ఇలాంటి స్టేట్‍మెంటే గతంలో కూడా గణేష్ ఇచ్చాడు కానీ పవన్ వేరే నిర్మాతలకే డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇది కేవలం స్టేట్‍మెంటే తప్ప ఖచ్చితంగా సినిమా మొదలవుతుందని అనుకోవడానికి లేదు.
ఎందుకంటే బండ్ల గణేష్ దగ్గర ఇప్పుడు ఏ దర్శకుడి డేట్లూ లేవు. రాజకీయాల్లోకి వెళ్లే ముందుగా తాను అడ్వాన్స్ లు ఇచ్చిన దర్శకులు, హీరోలు అందరి నుంచి అమౌంట్ తిరిగి తీసేసుకున్నాడని టాక్. పవన్ ఇప్పుడు సినిమా చేస్తానన్నా కానీ అది కార్యరూపం దాల్చాలంటే చాలా టైమ్ పడుతుంది. అయితే పవన్‍తో సినిమా వుందనే ప్రకటన బండ్ల గణేష్‍కు నిర్మాతగా బలం అవుతుంది. పవన్‍తో సినిమా వుందంటే తనకు ఫైనాన్స్ లు వస్తాయి. మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు తనను వెతుక్కుంటూ వస్తారు.
ఆ సినిమా మొదలయ్యేలోగా ఈలోపు మరో సినిమా లాంఛ్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. వెనక పెద్ద ప్రాజెక్ట్ వుందంటే ముందు చేసే మామూలు సినిమాకు కూడా బిజినెస్ చాలా ఈజీగా జరిగిపోతుంది. నిర్మాతగా భారీ సినిమాలే తీసినా కానీ చాలా గ్యాప్ వచ్చేసింది కనుక మళ్లీ తన బ్యానర్‍ని రీలాంఛ్ చేస్తున్నట్టుగానే అన్నీ సమీకరించుకోవాల్సి వుంటుంది.
This post was last modified on September 29, 2020 4:52 pm
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు…
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.…
హైదరాబాద్ వాసులకు.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం 2025 సందర్భంగా శుభాకాంక్షలతో పాటు కానుకను కూడా అందించారు. హైదరాబాద్…
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రయాణం చేయనున్నారు. ఏపీలో ఆయన…
సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ ని పొట్టివాడిగా మార్చి విచిత్ర సోదరులు…
తెలుగు సినీ పరిశ్రమను అమరావతి రాజధానికి తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణం పూర్తయితే.. అన్ని రంగాల…