Movie News

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు అందుకోవడానికి కావాల్సిన ఫార్ములాని సొంతంగా రాసుకుంటున్నారు. ఈ నమ్మకానికి వాల్తేరు వీరయ్యతో బాబీ కొల్లి పునాది వేయగా మన శంకరవరప్రసాద్ గారుతో అనిల్ రావిపూడి పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. విశ్వంభర తీసిన వశిష్ఠ కూడా వన్ మూవీ డైరెక్టరే.

వీటి తర్వాత బాబీకే మరో అవకాశమిచ్చిన చిరంజీవి ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే మూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఈ లైనప్ ఇలా ఉండగానే మరో డెబ్యూ డైరెక్టర్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సుకుమార్ క్యాంపు నుంచి వచ్చిన శ్రీనివాస్ మాయ చెప్పిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ బాగా నచ్చిందని, ఫైనల్ నెరేషన్ త్వరలోనే ఉంటుందని సమాచారం.

పక్కా పల్లెటూరి నేపథ్యంలో చిరంజీవి సినిమాలు చేసి చాలా కాలమయ్యింది. ముఖ్యంగా రీ ఎంట్రీ తర్వాత చేసినవన్నీ రూరల్ డ్రామాలు, హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ లే. తనకు తిరుగులేని పట్టున్న మాస్ కోసమే ప్రత్యేకంగా ఏ కథా చేయలేదు. అందుకే శ్రీనివాస్ మాయ చెప్పిన స్టోరీ ఫ్రెష్ గా అనిపించి ఉండవచ్చు. ఇన్ సైడ్ లీక్ ప్రకారం రంగస్థలం ఎలా అయితే రామ్ చరణ్ కు ఊహించని పెద్ద బ్రేక్ ఇచ్చిందో ఇప్పుడీ సబ్జెక్టు అంతకన్నా ఇంటెన్స్ డ్రామాతో రూపొందుతుందట.

కాకపోతే సెట్స్ పైకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. విశ్వంభర వేసవిలో రిలీజ్ అవుతుంది. బాబీ మూవీ అయితే 2027 సంక్రాంతి లేదంటే సమ్మర్ కు షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలకు ఎంత లేదన్నా షూట్ కోసం ఏడాది టైం ఇవ్వాలి. అంటే 2028 వచ్చేస్తుంది. సమాంతరంగా రెండు సినిమాలు చేయాలనుకుంటే ఇబ్బంది లేదు కానీ చిరంజీవి అంత రిస్క్ తీసుకుంటారానేది వేచి చూడాలి.

భుజానికి జరిగిన చిన్న సర్జరి వల్ల కొంత విశ్రాంతి తీసుకున్న మెగాస్టార్ వచ్చే నెల నుంచి తిరిగి షూటింగ్ లో బిజీ అయిపోతారు. ఏమైనా ఈ స్పీడ్ చూస్తుంటే అభిమానులకు రౌడీ అల్లుడులోని బాక్స్ బద్దలైపోతుంది డైలాగు గుర్తుకు వస్తోంది.

This post was last modified on March 11, 2026 4:37 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

1 hour ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

1 hour ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

5 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago