Political News

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసు విచారణను 4 వారాల్లో ముగించేయాలని, తీర్పు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇంకా సాగదీయడం సరికాదని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులో పూర్వాపరాలను విశ్లేషించి తీర్పు వెలువరించాలని బుధవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఏం జరిగింది?

2019 మార్చి 15 తెల్లవారుజామున వివేకానంద రెడ్డి కడపలోని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటు అని ప్రచారం చేసినా, ఆయనను గొడ్డలితో నరికి చంపారన్నది సీబీఐ చేసిన దర్యాప్తులో స్పష్టమైంది.

ఈ కేసులో గొడ్డలి తీసుకువచ్చి నరికి చంపిన వారిలో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఇటీవల సీబీఐ అధికారులు తుది చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు.

అయితే తమకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, విచారణ కొనసాగాల్సి ఉందని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ మళ్లీ దర్యాప్తు చేసింది. తాజాగా సీబీఐ మరో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. ఇక విచారించేందుకు ఏమీ స్కోప్ లేదని, అందరినీ విచారించామని, ఉన్న ఆధారాలు ఇవేనని తేల్చి చెప్పింది.

దీనిపై మరోసారి సునీత బుధవారం పిటిషన్ వేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది.

“మీకు ఇంకా సందేహాలు ఉంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించండి” అని సునీతకు సూచించింది. ఇదే సమయంలో సీబీఐ విచారించేందుకు ఇంకా ఏమీ లేదని చెబుతున్న నేపథ్యంలో ఈ కేసులో నాలుగు వారాల్లో తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.

దీంతో ఈ కేసులో ఇక తదుపరి విచారణలు ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. తీర్పు ఎలా ఉంటుంది? ఎవరిని దోషులుగా పేర్కొంటారు? అన్నది చూడాలి.

This post was last modified on March 11, 2026 4:55 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

57 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago