Political News

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి ఇంకా పాపులర్. పాలమ్మినా..పూలమ్మినా అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత తన మార్క్ డైలాగులతో, మాటలతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, తాజాగా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.

అవును మీరు విన్నది నిజమే..మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. తన సతీమణి కల్పనను మల్లారెడ్డి గ్రాండ్ గా మరోసారి వివాహమాడబోతున్నారు. అదేదో సాదా సీదా పెళ్లి కాదు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్‌…వేడుకలతో 5 రోజులపాటు ధూం ధాంగా ఈ పెళ్లి జరగనుంది.

తమ వివాహమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలా మళ్లీ పెళ్లికి మల్లారెడ్డి రెడీ అయ్యారు. మార్చి 19న జరగబోయే ఈ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్‌ కు ఏపీ, తెలంగాణలోని పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరుకాబోతున్నారు.

ఈ పెళ్లి సందర్భంగా 3 రోజుల క్రితం కీసరలో క్రికెట్ టోర్నమెంట్‌ ను బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రారంభించారు. మల్లారెడ్డి, కల్పనల వివాహానికి ట్రెండీగా ‘మల్పన’ అని హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసి తమ పెళ్లికి రావాలని మల్లారెడ్డి ఆహ్వానించారు.

మార్చి 14వ తేదీన మల్లారెడ్డి సంగీత్‌ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఇక, సంగీత్ వేడుకల్లో మల్లారెడ్డి అదిరిపోయే స్టెప్పులు వేసేందుకు వారం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారట. ప్రస్తుతం మల్లారెడ్డి పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on March 11, 2026 4:19 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago