తెలుగు సినిమా గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ఆయనతో పాటు.. ఆయన కంటే ముందు, వెనుక సంగీత ప్రయాణాన్ని ఆరంభించిన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు అడ్రస్ లేకుండా పోయారు కానీ.. కీరవాణి మాత్రం ఇప్పటికీ భారీ సినిమాలకు పని చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అనదగ్గ ‘ఆర్ఆర్ఆర్’కు ఆయనే సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే. అది కాక ఇంకో మూడు సినిమాలకు ఆయన పని చేస్తున్నారు.
ఈ మధ్యే కీరవాణితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరికొందరు కరోనా బారిన పడటం.. కోలుకున్నాక ప్లాస్మా దానం చేసి స్ఫూర్తి నింపడం తెలిసిన సంగతే. కొన్ని రోజుల విరామం తర్వాత కీరవాణి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన తన కొడుకు కాలభైరవతో కలిసి మరోసారి ప్లాస్మా దానం చేశాడు.
దీనికి సంబంధించిన అప్ డేట్ ఇస్తూ.. తన సినీ కెరీర్ గురించి కూడా కీరవాణి అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను ‘ఆర్ఆర్ఆర్’తో పాటు రెండు కొత్త సినిమాలకు పని చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఒకటి క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్నది కాగా.. మరొకటి కె.రాఘవేంద్రరావు నిర్మించేదని వెల్లడించారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ అతి త్వరలోనే మొదలవుతుందని కూడా కీరవాణి వెల్లడించారు.
ఐతే కీరవాణి చెబుతున్న క్రిష్ ప్రాజెక్టు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ప్రధాన పాత్రల్లో ఓ చిన్న సినిమాను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు క్రిష్. ఆ సినిమా కోసం పని చేస్తున్నట్లు వెల్లడించిన కీరవాణి.. అదే దర్శకుడితో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా గురించి అప్ డేట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా దాని షూటింగ్ ఆలస్యమయ్యేలా ఉండటంతో కీరవాణి దాని పని ఇంకా మొదలుపెట్టలేదేమో. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ త్వరలో మొదలవుతుందన్న కీరవాణి అప్ డేట్ అందుకోసం ఎదురు చూస్తున్న వాళ్లందరికీ ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on September 21, 2020 5:22 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…