Political News

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఇదేస‌మ‌యంలో తెలంగాణ వాదాన్ని మ‌రోసారి తీసుకువ‌చ్చారు. జూన్ 2న గ‌చ్చిబౌలిలోని ఓ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో తెలంగాణ న‌వ నిర్మాణ సంక‌ల్ప స‌భ‌పేరుతో స‌మ్మేళ‌నాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యం వెలుగు చూడ‌గానే.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, తెలంగాణ ర‌క్ష‌ణ సేన పార్టీ అధ్య‌క్షురాలు క‌విత‌.. ఖ‌స్సున లేచారు. ప‌వ‌న్‌పైనా.. ఆయ‌న వ్య‌వ‌హారంపైనా.. గ‌తంలో తెలంగాణ పై చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌వ్వితీసి విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలంగాణ‌లో ఎలా స‌భ పెట్టుకుంటార‌ని.. ఏపీలో చూసుకోవాల‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం వెనుక ప‌వ‌న్ అంటే భ‌య‌మా? లేక‌.. ఓటు బ్యాంకు అంటే భ‌య‌మా? అనేది ఆస‌క్తిగామారింది. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనిని కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌లుకూడా కీల‌కంగా భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఇప్పుడు బ‌లోపేతం అయితే.. కీల‌క‌మైన సెటిల‌ర్ల ఓటు బ్యాంకు.. జ‌న‌సేన‌కు మ‌ళ్లే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు వస్తున్నాయి. అదేస‌మ‌యంలో మున్నూరు కాపు సామాజిక వ‌ర్గం కూడా.. జ‌న‌సేన‌కు అండ‌గా మారే అవ‌కాశం ఉంది.

ఇక‌, పెట్టుబ‌డి దారులు, రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాలు కూడా.. ఏపీ నుంచి వ‌చ్చి ఇక్క‌డ సెటిల్ అయిన వారే కావ‌డంతో వారి మ‌ద్ద‌తు కూడా జ‌న‌సేన‌కు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది. సెటిలర్ల ఓట్లు ముఖ్యంగా యువత ఓట్లు జ‌న‌సేన‌కు ప‌డే ఛాన్స్ క‌నిపిస్తోంది. దీనిని నిలువ‌రించేందుకే.. అస‌లు ప‌వ‌నే రాకుండా చేసే వ్యూహం ప‌న్నుతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్లు మళ్లుతున్న నేప‌థ్యంలో పవన్ ఎంట్రీ ఇస్తే.. అది కాంగ్రెస్‌కు దెబ్బ కొట్టే అవ‌కాశం ఉంటుంది. అంద‌కే.. ఆయా పార్టీలు ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తున్నాయ‌న్న చ‌ర్చ న‌డుస్తోంది.

బీజేపీ మౌనం ఎందుకు?

మ‌రోవైపు.. జ‌న‌సేన‌తో ఏపీలోను.. కేంద్రంలోనూ కూట‌మిగా ఉన్న బీజేపీ.. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఇంత జ‌రుగుతున్నా.. ప‌వ‌న్‌ను ఇంత‌గా విమ‌ర్శిస్తున్నా.. తెలంగాణ బీజేపీ నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా నోరు విప్ప‌లేక పోయారు. తెలంగాణ వ్య‌తిరేకిగా ప‌వ‌న్‌పై ముద్ర వేస్తున్నా.. బీజేపీ నాయ‌కులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డం లేదు. దీంతో బీజేపీ వైఖ‌రి ఏంట‌నేది ఆస‌క్తిగామారింది. నిజానికి కేంద్రంలో జ‌న‌సేన పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on June 1, 2026 10:41 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

35 minutes ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

2 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

3 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

5 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

7 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

7 hours ago