Movie News

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇటీవలే నిర్మాత, ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించే సంకేతం ఇవ్వడంతో సినీ ప్రియుల సంతోషం పట్టరానిదిగా ఉంది. నేడో రేపో ప్రకటన రావడం ఖాయమని ఎదురు చూస్తున్న టైంలో ఆ ఘడియ వచ్చేసింది. ఈ గుడ్ న్యూస్ ప్రపంచానికి పంచుతూ ఏఎంబి యాజమాన్యం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

ఇది రాజమౌళి సుదీర్ఘంగా కన్న కల. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న ఐమాక్స్ దేశంలో అధిక రెవిన్యూ తెచ్చే టాలీవుడ్ కు లేకపోవడం అందరూ లోటుగా ఫీలవుతూ వచ్చారు. ఇప్పుడు అది నెరేవేరే దిశగా అడుగులు పడటం మంచి విషయమే. అసలు విశేషం ఏమిటంటే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు కాబోయే ఏఎంబి క్లాసిక్ (విక్టరీ) సముదాయంలో ఈ ఐమాక్స్ రాబోతోంది. ఈ మేరకు ఒప్పందం జరిగిందని నిన్నే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వచ్చింది.

రాబోయే ఏడాది కాలంలో మొత్తం మూడు కొత్త ఐమాక్స్ లు రాబోతున్నాయి. వాటిలో రెండు హైదరాబాద్ కి, మిగిలింది ఇంకో కొత్త నగరానికి ఇస్తారట. 2026 చివర్లో ఏఎంబి క్లాసిక్ కనక మొదలైపోతే విజువల్ గ్రాండియర్ ‘వారణాసి’ని అభిమానులు అందులోనే చూడొచ్చు. మరొకటి 2028 ప్లానింగ్ లో ఉందట. అనుభూతి పరంగా ఐమాక్స్ లో చూసిన ఫీలింగ్ మిగిలిన వాటిలో రాదు. సౌండ్, విజువల్స్, డీటెయిల్స్ దీంట్లో ఇంకో స్థాయిలో ఉంటాయి. అందుకే ఇంత డిమాండ్.

నిర్వహణ పరంగా కూడా ఐమాక్స్ చాలా ఖరీదైన వ్యవహారం. లైసెన్స్ కోసమే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రొజెక్టర్ విలువ కోట్లలోనే. చిన్న మరమత్తు వచ్చినా దానికయ్యే ఖర్చు మాములుగా ఉండదు. ఇప్పుడున్న రెగ్యులర్ టికెట్ రేట్లతో దాన్ని నడిపించడం అంత సులభంగా ఉండదు కాబట్టి స్పెషల్ క్యాటగిరీకి భావించి ధరలు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. రాజమౌళికే కాదు ఎందరికో స్వప్నంగా ఉన్న ఐమాక్స్ ని దేశమంతా విస్తరించే ప్రణాళికలు జరుగుతున్నాయట.

This post was last modified on June 1, 2026 5:06 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

39 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

7 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago