Movie News

అరడజను సినిమాలు ‘పెద్ది’కి పోటీగా

అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర భాషల్లో అయితే కొంత కాంపిటీషన్ అయితే స్వాగతం చెబుతోంది. ముందుగా బాలీవుడ్ సంగతి చూస్తే ‘హై జవానీ తో ఇష్క్ హోనాహై’ జూన్ 5 వస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరో కాగా పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్లు గట్రా జోరుగా చేస్తున్నారు. ట్రైలర్ చూస్తే రొటీన్ ఎంటర్ టైనర్ గానే ఉంది.

తమిళ మూవీ ‘పరిమళ అండ్ కో’ ఇతర భాషల్లో డబ్బింగ్ రూపంతో అదే రోజు వస్తోంది. జయరామ్, ఊర్వశి జంటగా దృశ్యం తరహా కాన్సెప్ట్ తో రూపొందింది. అయితే తెలుగు అనువాదం ఉంటుందా లేదానేది ఇంకా డౌట్ గానే ఉంది. ప్రేమలు, లోకా ఫేమ్ నస్లెన్ నటించిన ‘మోలీవుడ్ టైమ్స్’ ఈ లిస్టులో ఉంది. బాబీ డియోల్ ‘బందర్’ని హిందీతో పాటు మంకీ ఇన్ ఏ కేజ్ పేరుతో ఇంగ్లీష్ లోనూ తీసుకొస్తున్నారు. హాలీవుడ్ ‘స్కేరీ మూవీ’ కూడా వీటితో పాటు పందెంలో ఉంది.

అయితే ఇవేవి పెద్ది మీద ప్రభావం చూపించే అవకాశాలు లేవు. ఎందుకంటే చాలా చోట్ల రిలీజయ్యే ఛాన్స్ కూడా తక్కువే కాబట్టి. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మల్టీప్లెక్సుల్లో కాసిన్ని షోలు ఉంటాయి తప్పించి మిగిలిన చోట్ల పెద్దిదే ఆధిపత్యం అని చెప్పడానికి డౌట్ అక్కర్లేదు. ఒక హై జవానీతో ఇష్క్ హోనాహైకి పట్టణాలులో ఒకటి రెండు షోలు కేటాయిస్తారు కానీ వాటి ఆక్యుపెన్సీలు కూడా టాక్ మీదే ఆధారపడి ఉంటాయి.

చెప్పుకోదగ్గ సినిమా ఏదీ పోటీలో లేకపోవడం చూస్తే పెద్ది తాకిడిని తట్టుకోలేమనే క్లారిటీ అందరికీ ఉందని అర్థమవుతోంది. టైమింగ్ కూడా పెద్దికి బాగా కలిసి వచ్చింది. ఓవర్సీస్ లో అబ్సెషన్ తప్ప చెప్పుకోదగ్గ సమస్య లేదు. సో ఇప్పుడు రావాల్సిందల్లా టాక్ మాత్రమే. అది తెచ్చుకుంటే చాలు అమెరికా నుంచి అనకాపల్లి దాకా రికార్డుల మోత ఖాయంగా ఉంటుంది. జూన్ 3 రాత్రి ఎనిమిది గంటలకు షోలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఉద్వేగం మాములుగా లేదు.

This post was last modified on June 1, 2026 4:36 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago