విజ‌య్ బ‌ల‌హీన‌త‌లు బ‌య‌ట‌ప‌డిపోయాయ్

గ‌త ప‌దేళ్ల కాలంలో త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ రేంజే మారిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బిజ‌ ఒక‌ప్పుడు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు అత‌ను ద‌రిదాపుల్లో ఉండేవాడు కాదు. కానీ ఓవైపు ర‌జినీకాంత్ వ‌రుస ఫ్లాపుల‌తో డౌన్ అవుతుంటే.. మ‌రోవైపు విజ‌య్ వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇస్తూ ఎదిగిపోయాడు. చూస్తుండ‌గానే ర‌జినీని దాటి ముందుకు వెళ్లిపోయాడు.

అత‌డి హ‌వా ఎలా సాగిందంటే తెరి, బిగిల్, మాస్ట‌ర్ లాంటి యావ‌రేజ్ సినిమాలు కూడా భారీ వ‌సూళ్లు తెచ్చుకున్నాయి. అత‌డి సినిమాల‌కూ భారీగా బిజినెస్ జ‌ర‌గ‌డం మొద‌లైంది. ఐతే టైం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు. అందుకు గ‌త ఏడాదిన్న‌ర‌లో వ‌చ్చిన ఫ‌లితాలే ఉదాహ‌ర‌ణ‌. బీస్ట్ మూవీతో విజ‌య్ కెరీర్‌కు పెద్ద బ్రేకే ప‌డింది. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయింది. ఇక ఈ ఏడాది ర‌జినీ జైల‌ర్ మూవీతో బ‌లంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఆ సినిమా యావ‌రేజ్ టాక్‌తోనే చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయింది. విజ‌య్ ఇప్పుడు లియోతో ర‌జినీకి బ‌దులిస్తాడ‌ని అంతా అనుకున్నారు. కానీ మొన్న‌టిదాకా ఈ సినిమాకు ఉన్న హైప్ ఉన్న‌ట్లుండి త‌గ్గింది. అందుక్కార‌ణం.. ట్రైల‌ర్. ఏదో అనుకుని ట్రైల‌ర్ చూసిన వాళ్ల‌కు ప్యూజులు ఎగిరిపోయాయి. అది ఏమాత్రం అంచ‌నాల‌ను అందుకోలేని విధంగా సాధార‌ణంగా ఉండ‌టంతో విజ‌య్ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కులూ నిరాశ చెందారు.

ఒక్క‌సారిగా సినిమాపై నెగెటివిటీ ముసురుకుంది. ట్రైల‌ర్లో ఎక్కువ‌గా ట్రోలింగ్‌కు గుర‌వుతున్న‌ది విజ‌యే. అత‌డి లుక్ తేలిపోయింది. కొన్ని స‌న్నివేశాల్లో అత‌డి న‌ట‌న‌.. హావ‌భావాలు కూడా తుస్సుమ‌నిపించాయి. దీని మీద సోష‌ల్ మీడియాలో చాలా ట్రోలింగ్ న‌డుస్తోంది. లుక్స్, న‌ట‌న ప‌రంగా విజ‌య్ బ‌ల‌హీన‌త‌ల‌న్నీ ఈ ట్రైల‌ర్ బ‌య‌ట‌పెట్టేసింద‌ని.. లోకేష్ ఇలా చేశాడేంట‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.