పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. పుష్ప: ది రైజ్ రిలీజైనపుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన లేచింది మహిళా లోకం సినిమాలోనూ అచ్చం ఇలాంటి డైలాగే ఉంది. దాన్ని మంచు లక్ష్మే పలికింది.
పుష్ప డైలాగ్‌ను మీరు కాపీ కొట్టారేంటి అని అడిగితే.. తమది కాపీ డైలాగ్ కాదని నవ్వుతూనే స్పష్టం చేసింది మంచు లక్ష్మి. పుష్ప సినిమా కంటే ముందే తమ మూవీ షూటింగ్ పూర్తయిందని.. అల్లు అర్జున్ కంటే ముందే తాను ఫ్లవర్-ఫైర్ డైలాగ్ చెప్పానని ఆమె వెల్లడించింది. సుకుమార్ గారికి కూడా ఈ విషయం చెబుతున్నా అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఇక లేచింది మహిళా లోకం మూవీలో మోహన్ బాబు కల్ట్ మూవీ పెదరాయుడులోని ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ డైలాగ్‌తో పాటు మంచు విష్ణు ఒక ప్రెస్ మీట్లో ఆవేశంతో అన్న లెట్ దెమ్ నో అంకుల్ డైలాగ్‌ను అనుకరించే ప్రయత్నం చేశారు. దీని గురించి మంచు లక్ష్మిని అడిగితే.. అవి తన ప్రమేయం లేకుండా సినిమాలో పెట్టిన డైలాగులని.. తానేమీ డబ్బులిచ్చి రాయించుకోలేదని.. వీటితో తనకేం సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, కామెంట్ల గురించి స్పందిస్తూ.. ఒకప్పుడు తాను ఇలాంటి వాటికి కంగారు పడిపోయేదాన్నని.. ఇప్పుడు చాలా లైట్ అని.. మన వల్ల ఒకరు బతుకుతుంటే బతుక్కోని అనుకుంటున్నానని.. ఎవరేం చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చని ఆమె కామెంట్ చేసింది.
తాను ఇంతకుముందు మీడియాతో మాట్లాడేటపుడు కూడా.. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని జాగ్రత్తగా మాట్లాడేదాన్నని.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదని.. ఏమనిపిస్తే అది మాట్లాడేయగలుగుతున్నానని మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates