పవన్‌కళ్యాణ్‌తో సినిమా సెట్స్ మీద వుండగా క్రిష్ మరో సినిమా మొదలు పెట్టడంతో ఇక పవన్ సినిమా ముందుకి వెళ్లదేమోననే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పవన్ తనకు అందుబాటులోకి రావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుందని తెలియడం వల్లే క్రిష్ ఈ సినిమా మొదలు పెట్టాడు. మణికర్ణిక తర్వాత క్రిష్ సమయం చాలా వృధా అయింది. అందుకే పవన్ ‘వకీల్ సాబ్’ తర్వాత తన సినిమా మొదలు పెడదామని చెప్పినా వినకుండా హాఫ్ కాల్షీట్లు ఇచ్చి అయినా షూటింగ్ స్టార్ట్ చేయాలని పట్టుబట్టాడు.
కానీ కరోనా బ్రేక్ వల్ల అన్నీ తారుమారు కావడంతో క్రిష్ ఈలోగా ఒక చిన్న సినిమా ప్లాన్ చేసాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని అటవీ నేపథ్యంలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి నలభై రోజుల షెడ్యూల్ వేసి, ఖచ్చితంగా అంతే సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుని వెళుతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమానే ఏడు నెలలలో పూర్తి చేసేసిన క్రిష్‌కి ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేయడం పెద్ద పని కాదు. వకీల్ సాబ్ కంటే ముందే ఈ చిత్రం పూర్తయి, విడుదలయిపోతుందని క్రిష్ ధీమా.
Gulte Telugu Telugu Political and Movie News Updates