Movie News

రామ్ చరణ్ 16 ప్లానింగ్ అంతకు మించి

నెలల తరబడి ఎడతెగని ప్రహసనంగా సాగిపోతున్న గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ ఇండియన్ 2 మీద ఆధారపడి ఉండటంతో దర్శకుడు శంకర్ నిర్ణయం మీదే ఈ రెండు  సినిమాల రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయి. దీని తర్వాత రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. పైకి ఏం హడావిడి కనిపించడం లేదు కానీ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్లస్ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీని కోసం పెద్ద ప్లానింగే అమలులో ఉంది.

ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయబోయే ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాకు మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారట. విజయ్ సేతుపతిని లాక్ చేశారని, షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాక అప్పుడు ఆయన అందుబాటుని బట్టి కాల్ షీట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉప్పెనతో తనకు పెద్ద పేరు ఇచ్చిన బుచ్చిబాబు నుంచి అంతకు మించిన క్యారెక్టర్ వచ్చేసరికి మక్కల్ సెల్వన్ సంతోషం వ్యక్తం చేశారట. ఇక మాజీ హీరోయిన్ లయకో కీలక పాత్ర ఇచ్చారని తెలిసింది. ఇది షాకింగ్ గా ఉంటుందని, రమ్యకృష్ణ రేంజ్ నటీమణులు పోషించే రోల్ లో లయ దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారట.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఏఆర్ రెహమాన్ సంగీతం మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తానీ ప్రాజెక్టు చేస్తున్నట్టు ఆయనే స్వయంగా చెప్పడంతో డౌట్ తీరిపోయింది. కాకపోతే రెహమాన్ నుంచి బెస్ట్ ఆల్బమ్ రాబట్టుకోవడం బుచ్చిబాబు చేతుల్లో ఉంది. గేమ్ చేంజర్ కు గుమ్మడి కాయ కొట్టడానికి ఫిబ్రవరి వచ్చేలా ఉంది. అదే జరిగితే 2024 దీపావళి లేదా దసరా తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇది తెలిసే నిర్మాత దిల్ రాజు టీమ్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. సంక్రాంతికి టీజర్ వదిలే ఆలోచనైతే ప్రస్తుతానికి చేస్తున్నారు.

This post was last modified on July 23, 2023 5:00 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

1 hour ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago