Movie News

మురారి సినిమా శాపంలా ఇన్ని ట్విస్టులా

కృష్ణవంశీ మురారి గుర్తుందిగా. అందులో మహేష్ బాబు ఫ్యామిలీలో తరానికి ఒకరు అమ్మవారి శాపం వల్ల ఏదో ఒక ప్రమాదానికి గురై చనిపోతూ ఉంటారు. చివరికి బామ్మ సంకల్పం, పూజలతో తాను ఆత్మర్పణం చేసి ఆ గండం నుంచి గట్టెక్కిస్తుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కలయికను చూస్తుంటే అచ్చంగా ఇలాంటి దోషమేదైనా వెంటపడుతోందేమో అనిపిస్తోంది. అభిమానులకు గుర్తుందో లేదో కానీ వీళ్ళ మొదటి కలయిక అతడు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. దీని వల్లే నిర్మాత మురళీమోహన్ కు బడ్జెట్ పెరిగిన విషయం ఆయనే ఇంటర్వ్యూలలో చెప్పారు.

రెండోసారి కలుసుకున్న ఖలేజా ఏకంగా మూడేళ్లు పట్టింది. ప్రొడ్యూసర్లకు ఆ భారం ఇబ్బంది పెట్టిన వైనం మీడియాలోనూ వచ్చింది. అది క్లాసిక్ గా నిలవడం వేరే సంగతి కానీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన మాట వాస్తవం. ఇప్పుడు గుంటూరు కారం కోసం చేతులు కలిపారు. ముందు పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనుకున్నారు. తర్వాత ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ గా మారిపోయింది. ఫైట్ మాస్టర్లు అన్బు అరివు స్థానంలో రామ్ లక్ష్మణ్ లు వచ్చారు. విడుదల తేదీ ఏప్రిల్ 28, ఆగస్ట్ 11 ఆ తర్వాత జనవరి 13కి షిఫ్ట్ చేశారు. హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుని ఆ ప్లేస్ లో శ్రీలీల, తోడుగా మీనాక్షి చౌదరి వచ్చారు.

ఛాయాగ్రహణం బాధ్యతలు మాది నుంచి వినోద్ అటు నుంచి రవి కె చంద్రన్ కు వచ్చాయి. తమన్ మారిపోయి ఆ ప్లేస్ లో హేశం అబ్దుల్ వహాబ్, భీమ్స్ వస్తారనే లీక్ ఊపందుకుంది. ఇన్ని ప్రతికూలతలు మధ్య టీజర్ ఇచ్చిన హైప్ తగ్గిపోయిన మాట వాస్తవం. త్రివిక్రమ్ గతంలో అల్లు అర్జున్ తో మూడు సినిమాలు చేసినప్పుడు వేగంగానే పూర్తి చేశారు. కానీ కావాలని చేయకపోయినా తాను ఎంతో ఇష్టపడే మహేష్ బాబుతోనే గురూజీకి బ్రేకుల పర్వం పడుతోంది. ఇలా జరగాలని ఎవరూ కోరుకోకపోయినా పైన చెప్పినట్టు ఏదో శాప ప్రభావమే. వీటికి ఎప్పుడు చెక్ పడుతుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

This post was last modified on July 23, 2023 5:06 pm

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

31 minutes ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

2 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

5 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

8 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

8 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

10 hours ago