ప్రస్తుతం ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఇండియన్-2’ ఒకటి. రెండున్నర దశాబ్దాల కిందట సంచలనం రేపిన ‘ఇండియన్/భారతీయుడు’ సినిమాకు కొనసాగింపుగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘ఇండియన్’లో హీరోగా నటించిన కమల్ హాసనే ఇప్పుడు కూడా లీడ్ రోల్ చేస్తున్నాడు.
నాలుగేళ్ల కిందటే మొదలైన ఈ సినిమా సెట్లో జరిగిన ఘోర ప్రమాదం, కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. రెండేళ్లకు పైగా షూటింగ్ ఆపేశారు. ఐతే దర్శక నిర్మాతలు, హీరో మాట్లాడుకుని గత ఏడాది చివర్లో మళ్లీ చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అనుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సినిమా బిజినెస్ చర్చలు మొదలయ్యాయి.
రిలీజ్‌కు చాలా టైం ఉండగానే ఈ సినిమాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మించి దీనికి డిజిటల్ డీల్ ఆఫర్ ఒకటి వచ్చినట్లు సమాచారం. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.220 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనబోతున్నట్లు తెలిసింది. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకూ కలిపి ఈ రేట్ కోట్ చేశారట.
ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ రేటు అనిపించినా.. రిలీజ్ టైంకి దీన్ని ఈజీగా వర్కవుట్ చేయొచ్చని నెట్ ఫ్లిక్స్ భావిస్తోందట. ‘ఇండియన్-2’ డిజిటల్ హక్కుల కోసం అమేజాన్ ప్రైమ్, జీ ఓటీటీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నట్లు సమాచారం. ఐతే నెట్ ఫ్లిక్స్‌కే హక్కులు సొంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రూ.200 కోట్లలో తీయాలనుకున్నారు కానీ.. సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ రూ.300 కోట్లను దాటబోతున్నట్లు సమాచారం. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on July 23, 2023 2:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…