తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఫిలిం ఛాంబర్ కోరినా అందరికంటే నేనే ముందు చెప్పాననే లాజిక్ తో వారసుడు భారీ రిలీజ్ కోసం దిల్ రాజు తన ప్లానింగ్ ని కొనసాగిస్తున్నారని బయ్యర్స్ టాక్. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కోసం స్క్రీన్లు కాసిన్ని ఎక్కువ ఇవ్వడం లాంటివేవీ జరగడం లేదని వినికిడి. తాజాగా అజిత్ తునివు డబ్బింగ్ రైట్స్ వేరొకరికి అమ్మేశారు. మూడు కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. తెగింపు టైటిల్ ని పరిశీలిస్తున్నారు. రిజిస్టర్ అయ్యిందో లేదో చెక్ చేసుకునే పనిలో పడ్డారు. ఒకవేళ కుదరకపోతే వలిమై లాగా అదే పేరు పెట్టినా ఆశ్చర్యం లేదు.
ఇదంతా బాగానే ఉంది కానీ మెల్లగా ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లు గట్రా చేయాలి. ముఖ్యంగా వారసుడుకి రాజుగారు ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చెన్నైలో అంగరంగ వైభవంగా జరుగుతుంది కానీ హైదరాబాద్ లో చేసే ఫంక్షన్ కి విజయ్ ని తీసుకొస్తారానేది ఆసక్తికరంగా మారింది. తుపాకీ నుంచి మార్కెట్ పెరిగినా విజయ్ ఏనాడూ కనీసం ఇక్కడి మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. మాస్టర్ కి విపరీతమైన పోటీలో మంచి రిలీజ్ దక్కినా భాగ్యనగరంలో అడుగు పెట్టలేదు. ఇక్కడే నిర్మాతలే చెన్నై వెళ్లి ఫోటోలు దిగారు.
దిల్ రాజుని తక్కువ అంచనా వేయలేం కానీ ఎప్పుడూ లేనిది వారసుడు కోసం విజయ్ వస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. ఇక అజిత్ సంగతి తెలిసిందే. తన కెరీర్ మూలాలు ప్రేమపుస్తకంతో మొదలుపెట్టి టాలీవుడ్ లోనే ఉన్నాయని తెలిసినా కూడా ఇక్కడ ఈవెంట్ల మీద ఆసక్తి చూపించలేదు. తమిళంలోనే నో అనే ఆయన మన దగ్గరికి వస్తారనుకోవడం అత్యాశే. ఎవరిష్టం వాళ్ళదని సింపుల్ గా చెప్పడానికి లేదు. సినిమా అనేది పబ్లిక్ కోసమే అయినప్పుడు జనంలోకి స్టార్లు రావాలి. అప్పుడే రీచ్ మరింత పెరుగుతుంది. రజనీకాంత్, విక్రమ్, కార్తీలు ఎన్నిసార్లు వచ్చారో లెక్క లేదు. మరి విజయ్ అజిత్ లు ఈసారికైనా కరుణిస్తారో లేదో.
This post was last modified on December 6, 2022 1:23 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…