నిన్న పవన్ సుజిత్ కాంబినేషన్ ని ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా పవర్ ఫ్యాన్స్ హంగామాతో ఊగిపోతోంది. సాహో లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మూవీ అన్నాక సవాలక్ష అనుమానాలు రావాలి కానీ రివర్స్ లో అధిక శాతం పాజిటివ్ వైబ్రేషన్స్ చూపిస్తుండటం మరో ట్విస్ట్. అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి రాకముందు సుజిత్ ఓ పవన్ సినిమా బెనిఫిట్ షో చూస్తూ బయటికొచ్చి ఊగిపోయిన వీడియోని వెతికి మరీ వైరల్ చేస్తున్నారు. ఏకంగా హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో దాన్ని షేర్ చేశారంటే రీచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కెమెరామెన్ ని ప్రకటించిన టీమ్ సంగీత దర్శకుడెవరనేది మాత్రం చెప్పలేదు
అభిమానులు మాకు అనిరుధ్ రవిచందరే కావాలనే డిమాండ్ తో ట్రెండింగ్ గట్రా జోరుగా చేస్తున్నారు. గతంలో అతను అజ్ఞాతవాసి లాంటి మర్చిపోలేని సూపర్ ఫ్లాప్ కి పని చేసినప్పటికీ అందులో రెండు మూడు పాటలు బాగానే హిట్టయ్యాయి. పైగా అప్పటికి ఇప్పటికీ ఫామ్ లో బోలెడు మార్పు వచ్చేసింది. విక్రమ్ దెబ్బకు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయాడు. అందుకే మధురై టు ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఇతనైతేనే న్యాయం చేయగలడని వాళ్ళ నమ్మకం. కానీ ప్రాక్టికల్ సెన్స్ లో చూస్తే దానికి అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ లాక్ అయిపోయాడు.
అతనెవరో కాదు జిబ్రాన్. సుజిత్ మొదటి చిత్రం రన్ రాజా రన్, రెండో మూవీ సాహో(బ్యాక్ గ్రౌండ్ స్కోర్) కి పని చేసింది ఇతనే. ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డీల్ చేయడం కొత్తేమి కాదు కానీ ఈ మధ్య మరీ గొప్పగా చెప్పుకునే బ్రేక్ అయితే తెచ్చుకోలేదు. తగినంత టైం ఇస్తే ఖచ్చితంగా మంచి ఆల్బమే ఇస్తాడు. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా జిబ్రాన్ తన ట్విట్టర్ లో ప్రత్యేకంగా పోస్టర్ ని షేర్ చేసుకోవడంతో దాదాపు ఖరారే అనిపిస్తోంది. అయినా చివరి నిమిషంలో మార్పులు ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి వెంటనే కంక్లూజన్ కి రాలేం కానీ వెయిట్ చేసి చూడాలి.
This post was last modified on December 6, 2022 11:25 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…