Movie News

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే ఆయ‌న ఫ‌స్ట్ డైలాగ్ రాసిన‌ట్లు క‌దా అనిపించ‌వ‌చ్చు. కానీ అధికారికంగా రైట‌ర్‌గా తెర‌పై త్రివిక్ర‌మ్ పేరు ప‌డింది స్వ‌యంవ‌రం మూవీకే అయినా.. అంత‌కుముందు ఆయ‌న చాలా సినిమాల‌కు ఘోస్ట్ రైట‌ర్‌గా ప‌ని చేసిన సంగ‌తి చాలామందికి తెలియ‌దు. 90వ ద‌శ‌కంలో స్టార్ రైట‌ర్‌గా వెలుగొందిన పోసాని కృష్ణ‌ముర‌ళి ద‌గ్గ‌ర కొన్నేళ్ల పాటు ప‌ని చేసిన త్రివిక్ర‌మ్.. కొన్ని చిత్రాల‌కు క‌థ, మాట‌ల్లో కీల‌క పాత్ర పోషించారు.

అందులో ప‌విత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం లాంటి సినిమాలున్నాయి. ఈ రెండు చిత్రాల్లో విక్ట‌రీ వెంక‌టేషే హీరో అన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా ఆద‌ర్శ కుటుంబం సినిమా చేశారు త్రివిక్ర‌మ్. ఈ సినిమా నుంచి తొలి పాట నారాయ‌ణ‌మ్మా రిలీజ్ సంద‌ర్భంగా వెంకీతో త‌న అసోసియేష‌న్ గురించి గుర్తు చేసుకుంటూ.. ఆయ‌న‌కే ర‌చ‌యిత‌గా త‌న తొలి డైలాగ్ రాసిన విష‌యాన్ని వెల్ల‌డించారు త్రివిక్ర‌మ్.

”వెంక‌టేష్ గారు మీకే కాదు.. నాకు కూడా ఫేవ‌రెట్ హీరో. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. నేను ర‌చ‌యిత‌గా తొలి డైలాగ్ రాసింది ఆయ‌న‌కే. ప‌విత్ర బంధం సినిమాకు నేను డైలాగ్స్ రాశాను. ఆ త‌ర్వాత పెళ్ళిచేసుకుందాం చిత్రానికి కూడా ప‌ని చేశాను. ఐతే నేనెవ‌ర‌న్న‌ది ఆయ‌న‌కు తెలియ‌దు. డైరెక్ట‌ర్ ముత్యాల సుబ్బ‌య్య గారితో మాట్లాడుతూ.. వెంక‌టేష్ గారు నా గురించి ప్ర‌స్తావించార‌ని తెలిసింది. ఈ అబ్బాయి ఎవ‌రో బాగా రాస్తున్నాడు అన్నార‌ట‌. త‌ర్వాత నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాకు ప‌ని చేస్తున్న‌పుడు దీని గురించి మేం మాట్లాడుకున్నాం.

వెంక‌టేష్ గారంటే నాకు చాలా భ‌యం. ఇప్ప‌టికీ ఆ భ‌యం ఉంది. ఎందుకంటే మొద‌ట్నుంచి ఆయ‌న్ని దూరం నుంచి చూడ‌డం వ‌ల్ల ఆ భ‌యం కొన‌సాగుతోంది. అది గౌర‌వంతో కూడిన ఇష్టం వ‌ల్ల వ‌చ్చిన భ‌యం కావ‌చ్చు. వెంక‌టేష్ గారి క‌మిట్మెంట్ గొప్ప‌ది. 76 సినిమాలు చేశాక కూడా సినిమా కోసం ఆయ‌న ఎంతో త‌ప‌న ప‌డ‌తారు. సినిమాకు ఏం కావాలో అదంతా ఇవ్వ‌డానికి చూస్తారు. ఒంట్లో బాలేక‌పోయినా త‌న వ‌ల్ల రిలీజ్ టైం లైన్ దెబ్బ కూడ‌ద‌ని డ‌బ్బింగ్ పూర్తి చేసి వ‌చ్చారు” అంటూ వెంకీని త్రివిక్ర‌మ్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. వెంకీ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఆద‌ర్శ కుటుంబం అక్టోబ‌రు 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on September 28, 2026 12:17 am

Share

Recent Posts

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

56 minutes ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

2 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

5 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

6 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

7 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

7 hours ago