Movie News

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో మొదలుపెట్టి రెండు మూడు డేట్లు వేసి తర్వాత హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. టీజర్ మీద రెస్పాన్స్ బాగానే వచ్చింది కానీ సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకునే రేంజ్ లో కాకపోవడం టీమ్ ని కొంత నిరాశ పరిచి ఉంటుంది. అయితే నెలలు గడుస్తున్నా, ఏడాది అయిపోవస్తున్నా ఇప్పటిదాకా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడం విచిత్రంగా ఉంది.

అక్టోబర్ లో ఒక మంచి స్లాట్ మిస్ అయ్యింది. గాంధీ జయంతిని ఆదర్శ కుటుంబం వదిలేశాక దాన్ని చిన్న సినిమాలు వాడుకుంటున్నాయి. దసరాకి జైలర్ 2, రణబాలితో పాటు వెంకటేష్ కూడా బరిలో ఉంటారు కాబట్టి ఆ కాంపిటీషన్ లో వెళ్లడం కష్టం. ఇక అక్టోబర్ చివరి వారం మరో మంచి ఆప్షన్. ఆ దిశగానే స్వయంభు నిర్మాతలు ఆలోచిస్తున్నారనే ప్రచారం ఉంది కానీ అఫీషియల్ ముద్ర అయితే పడలేదు.

అసలు నిఖిల్ బృందం సమస్య ఏమిటో అంతు చిక్కడం లేదు. ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా త్వరలో ప్రకటన వస్తుందని ట్వీట్ చేశాక మళ్ళీ ఎలాంటి సౌండ్ లేదు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన స్వయంభులో సంయుక్త మీనన్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. బాహుబలి రేంజ్ లో జానపదం, ఫాంటసీ సెటప్ ఉంది. నిఖిల్ ఒళ్ళు హూనం చేసుకుని మరీ విపరీతంగా కష్టపడ్డాడు. తీరా చూస్తే మూవీకి మోక్షం దక్కడం లేదు.

స్వయంభు ఒకటే కాదు ఇప్పటికీ విశ్వంభర వ్యవహారం తేలలేదు. ఇంత కాలానికి ఓటిటి డీల్ అయ్యిందనే టాక్ వచ్చింది కానీ కాకా వల్ల రిలీజ్ డేట్ విషయంలో అయోమయం కొనసాగుతోంది. చిరంజీవికే ఈ తిప్పలు అంటే నిఖిల్ కు ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు సైతం ఎన్నో అడ్డంకులు ఆలస్యాలు చూస్తూ సంక్రాంతికి ప్లాన్ చేస్తోంది. ఇదంతా ఏమో కానీ ముందైతే స్వయంభు ఏదో ఒకటి తేల్చేసి వీలైనంత త్వరగా ప్రమోషన్లు మొదలుపెడితే మంచిది.

This post was last modified on September 27, 2026 10:47 pm

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

4 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

5 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

6 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

6 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

7 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

8 hours ago