అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం పట్టింది. అయితే.. ఈ ఏడాది మరింతగా ఈ రేటింగ్ తగ్గుముఖం పట్టడం.. 36కు చేరుకోవడంతో రిపబ్లికన్‌నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికల సమయంలో అధ్యక్షుడి రేటింగ్ పార్టీకి అత్యంత కీలకం. ఈ రేటింగ్ ఆధారంగానే ప్రజలు ఓటేస్తారు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు జరుగుతుండడం.. పలు సర్వేలు రేటింగ్ తగ్గుముఖం పట్టిందని రిపోర్టు ఇవ్వడం మరింత ఆందోళనకు దారి తీసేలా చేసింది. అమెరికా చరిత్రలోనే తొలిసారి అధ్యక్షుడికి రేటింగ్ ఈ రేంజ్‌లో తగ్గడంపైనా ప్రజలు విస్తు బోతున్నారు.
తాజాగా.. జాతీయ సర్వేల సగటు ప్రకారం ట్రంప్ పనితీరుకు మద్దతు 36% – 38% మధ్య ఉంది. జనవరి 2025లో ఆయన రెండో విడత పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజాదరణ 47% వద్ద ప్రారంభమైంది. కాలక్రమేణా ఆయన మద్దతు క్రమంగా తగ్గుతూ వచ్చింది. వివిధ ప్రముఖ సర్వేల(న్యూయార్క్ టైమ్స్, గాలప్) నివేదికల ప్రకారం ఇది కనిష్టంగా 30% వరకు, గరిష్టంగా 40% వరకు నమోదవుతోంది. వాస్తవానికి గతంలో ఎప్పుడూ అధ్యక్షుల రేటింగ్ 45 % పైగానే ఉండేది. కానీ, ట్రంప్ రేటింగ్ మాత్రం తగ్గుముఖం పడుతూ వచ్చింది.
ఏంటి కారణాలు..?
+నిరుద్యోగం: అమెరికాలో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్న ట్రంప్.. ఈ వాగ్దానాన్ని మరిచిపోయారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు నిరుద్యోగం పెరుగుతోంది. ఇవన్నీ గంపగుత్తగా ట్రంప్‌ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
This post was last modified on September 27, 2026 1:25 pm
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…
సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…