Movie News

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి రెడ్డి నుంచి కోడి రామకృష్ణ దాకా ఎందరో మహానుభావులు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అయితే వీళ్లందరిలో లేని ఒక ప్రత్యేక లక్షణం రాజమౌళిని ఆస్కార్ దాకా తీసుకెళ్లింది. స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ క్యామరూన్ లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ తో శబాష్ అనిపించుకుంది. ఆ విజయ రహస్యం మీద చిరు విశ్లేషణ చేద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ తీసినప్పుడు రాజమౌళి మీద ఎలాంటి మార్క్ లేదు. పైగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఆయన ముద్ర రిపీట్ చేశారనే అభిప్రాయం వినిపించింది. అయితే ‘సింహాద్రి’తో ఆ లెక్కలను తారుమారు చేశారు జక్కన్న. పాతికేళ్లు లేని ఒక్క స్టార్ కుర్రాడి మీద కేరళ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ హీరోయిజం పండించడం చూసి జనం వెర్రెక్కిపోయి రికార్డులు కురిపించారు. జనాలకు పరిచయమే లేని రగ్బీ ఆటని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని తీసిన ‘సై’ విజయం మరో సెన్సేషన్.

ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ ఇలా కమర్షియల్ జానర్ లో స్థాయిని పెంచుకుంటూ పోయిన రాజమౌళి ‘మగధీర’తో సృష్టించిన సునామి బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎందరికో ప్రకంపనలు పుట్టించింది. పీరియాడిక్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ ని ప్రెజెంట్ చేసిన తీరు బాక్సాఫీస్ ని శాశించింది. సోలో హీరోగా అసలు మార్కెట్ లేని సునీల్ తో మర్యాదరామన్న, అధిక శాతం హీరో లేకుండా కేవలం విఎఫ్ఎక్స్ ని నమ్ముకుని చేసిన ‘ఈగ’ ఇవన్నీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ అంటే ఏంటో జనాలకు రుచి చూపించాయి.

ఇక బాహుబలి, బిగినింగ్ కంక్లూజన్ అంటూ రెండు భాగాల జానపద కథను ప్రేక్షకులకు రుచి చూపించిన తీరు ఇటు జక్కన్న, అటు ప్రభాస్ కు ఇద్దరికీ ప్యాన్ ఇండియా స్థాయిలో యెనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. అసాధ్యం అనుకున్న తారక్ చరణ్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో చేసి చూపించిన రాజమౌళి ఏకంగా ఆస్కార్ ని తెలుగు గుమ్మానికి తెచ్చారు. వచ్చే ఏడాది ‘వారణాసి’ రాబోతోంది. ఇది సృష్టించబోయే ప్రకంపనలు ఆడియన్స్ ఇప్పుడే ఫీలవుతున్నారు. మహేష్ బాబుకే కాదు మొత్తం టాలీవుడ్డే గర్వంగా చెప్పుకునే ఒక విజువల్ గ్రాండియర్ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

This post was last modified on September 27, 2026 4:53 pm

Share

Recent Posts

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

11 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

49 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

4 hours ago