Movie News

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ రికార్డింగ్ ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. విశ్వంభర సంక్రాంతికి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించేలా కనిపించడం లేదు. ఒకవేళ అనివార్యమైతే రెండు తక్కువ గ్యాప్ లో రిలీజ్ పెట్టుకుంటాయేమో ఇప్పుడే చెప్పలేం కానీ, దీని గురించిన డిస్కషన్స్ మెగా ఫ్యాన్స్ లో ఎక్కువగానే ఉన్నాయి. సరే ఇవి ఓకే కానీ చిరంజీవి నెక్స్ట్ ఎవరితో చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

మాములుగా అయితే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ప్రాజెక్టు ఎప్పుడో అనౌన్స్ అయ్యింది కాబట్టి ముందు దాన్ని మొదలుపెట్టాలి. కానీ ప్యారడైజ్ కు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్, షూటింగ్ సమయంలో జరిగిన విపరీతమైన జాప్యం, బయట జరిగిన ప్రచారాలు, వాటికి కొంత బలం చేకూరుస్తూ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు ఇవన్నీ ఎంతో కొంత ప్రభావమైతే చూపిస్తాయి. పైగా శ్రీకాంత్ ఓదెల కనీసం మూడు నాలుగు నెలలు రెస్ట్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారట.

ఒకవేళ ఈ ఆప్షన్ కాదనుకుంటే బుచ్చిబాబుకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇంకా ఫైనల్ కాలేదు కానీ స్క్రిప్ట్ రెడీ అయ్యాక నెరేషన్ ఇస్తారని తెలిసింది. పెద్ది ఫలితం ఎలా ఉన్నా దాని మేకింగ్ స్టయిల్ చిరుని మెప్పించిన మాట వాస్తవం. ఒకవేళ సాలిడ్ కంటెంట్ తో కనక రెడీ చేస్తే ఈ మూవీనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. హరీష్ శంకర్, మారుతీ లాంటి వాళ్ళు కూడా తమ పరిధిలో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చెప్పలేం.

రజనీకాంత్ లాగే చిరంజీవి కూడా ఇదే స్పీడ్ కొనసాగించే ప్లానింగ్ లో ఉన్నారట. ముఖ్యంగా కాకా రూపొందుతున్న తీరు చూసి ఇలాంటివి ఏడాదికి ఈజీగా రెండు చేయొచ్చని తన సన్నిహితులతో అన్నట్టు వినికిడి. ఎలా చూసినా 2027లో చిరంజీవి రెండు సినిమాలతో కనిపించడం ఖాయం. కాకా ఎలాగూ జనవరి 13 వచ్చేస్తుంది. మరి విశ్వంభర ఏం చేస్తుందనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. కాకా మీద బిజినెస్ వర్గాల్లో, ఆడియన్స్ లో మంచి క్రేజ్ నెలకొంది.

This post was last modified on September 27, 2026 6:56 pm

Share

Recent Posts

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

48 minutes ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

2 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

2 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

3 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

4 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

5 hours ago