Political News

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత త‌నపై కేసులు న‌మోదు కావ‌డం.. జైలు జీవితం.. అనంతరం.. వ‌చ్చిన స్థానిక ఎన్నికలపై వంశీ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. గన్నవరంలో ఇటీవల జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వంశీ పాల్గొని, గ్రామస్థాయి నుంచి బలమైన నాయత్వాన్ని తయారు చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని క‌సితో ఉన్నామ‌ని కూడా వంశీ చెప్పారు. ఇదే స‌మ‌యంలో ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు పాలనపై వంశీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెబుతున్నారు. అయితే.. ఇది ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్నది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

సెంటిమెంటును పండిస్తూ..
గతంలో వివాదాలు, కేసుల నేపథ్యంలో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటారనే ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా వంశీ పార్టీ కార్యక్రమాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారు. ఈ క్ర‌మంలో సెంటిమెంటు రాజ‌కీయాల‌కు కూడా తెర‌దీస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు 24/7 అందుబాటులో ఉంటాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో పింఛ‌న్లు వ‌చ్చిన వైసీపీ నాయ‌కుల కుటుంబాల‌కు ప్ర‌స్తుతం పింఛ‌న్లు తీసేశార‌ని.. వీటిపై తాను ప్ర‌త్య‌క్ష పోరాటం చేస్తాన‌ని చెబుతున్నారు. అలాగే ఇళ్ల స్థ‌లాలు కూడా ఇపిస్తాన‌ని చెబుతున్నారు.

మారిన మాట‌..
ఇక‌, ఇదే స‌మ‌యంలో వంశీ కొత్త మార్పు కూడా క‌నిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న తీవ్ర‌వ్యాఖ్య‌ల‌తో టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డే వారు. కానీ, కేసుల ప్ర‌భావ‌మో ఏమో తెలియ‌దు కానీ.. ఆయ‌న ఇప్పుడు కేవ‌లం విధాన‌ప‌ర‌మైన అంశాల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఎవ‌రినీ ప‌రుషంగా వ్యాఖ్యానించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుత ఎమ్మెల్యే యార్ల‌గడ్డ‌పై ప‌న్నెత్తు మాట‌కూడా అన‌కుండానే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ మార్పు మంచిదేనని కొంద‌రు అంటుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం కేసుల ప్ర‌భావం భారీగానే ప‌డింద‌ని చెబుతున్నారు.

This post was last modified on September 25, 2026 11:27 am

Share

Recent Posts

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

39 minutes ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

5 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

5 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

7 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

7 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

7 hours ago