ఒకప్పుడు సెలబ్రెటీలెవరైనా ఒక పది కోట్లు పెట్టి ఇల్లో, ఫ్లాటో కొంటే దాన్ని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పది ఇరవై కోట్లంటే వారికి చిన్న విషయం అయిపోయింది. 50-100-150-200 కోట్లు పెట్టి కూడా ప్రాపర్టీస్ కొనేస్తున్నారు. తమ జీవిత భాగస్వాముల కోసం లగ్జరీ ప్రాపర్టీస్ కొని గిఫ్లుగా ఇస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ కోసం ఏకంగా వంద కోట్లు పెట్టి కొత్త ఇల్లు తీసుకున్నాడట. ఇప్పుడీ విషయం బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్ మొదలైన ఆరంభంలోనే తన చిన్ననాటి స్నేహితురాలైన సుజానే ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఆమెతో ఇద్దరు పిల్లల్ని కూడా కన్న హృతిక్.. కొన్నేళ్ల కిందట తన మొదటి భార్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. మధ్యలో కొన్నాళ్లు కంగనా రనౌత్‌తో అతడి ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత ఆమెతో తెగతెంపులయ్యాయి. కొంత కాలం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేశాడు.
ఐతే రెండేళ్ల కిందట్నుంచి సబా ఆజాద్‌తో హృతిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందటే వీళ్లిద్దరూ ఈ విషయమై ఓపెన్ అయిపోయారు. బయట కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇప్పటిదాకా వేర్వేరు ఇళ్లలోనే ఉంటూ ప్రేమాయణాన్ని నడిపించిన హృతిక్-సబా.. త్వరలోనే ఒకే ఇంట్లోకి చేరబోతున్నారట.
సబా కోసం రూ.100 కోట్లతో ఒక లగ్జరీ ఇంటిని కొన్నాడట హృతిక్. ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో బీచ్ వ్యూ ఉండేలా ఆహ్లాదకరమైన ఒక లగ్జరీ హౌస్‌ను హృతిక్ కొనుగోలు చేశాడట. త్వరలోనే వీరు ఆ ఇంటికి మకాం మార్చనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి వైపు అడుగులు వేసినా ఆశ్చర్యం లేదు. హృతిక్ కెరీర్ విషయానికి వస్తే.. ‘వార్’ తర్వాత సరైన విజయం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. ఇటీవల అతడి సినిమా ‘విక్రమ్ వేద’ మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది.
This post was last modified on November 19, 2022 10:29 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…