Movie News

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసిన హీరోయిన్లు పెద్ద‌గా క‌నిపించ‌రు. ఒక‌ట్రెండు సినిమాల‌తో మాయ‌మైపోయిన వాళ్లే ఎక్కువ‌. ఐతే జాన్వి క‌పూర్ అలా కాకుండా తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తుందేమో అనిపించింది. త‌ల్లి శ్రీదేవికి తెలుగు చిత్రాల‌తో ఉన్న క‌నెక్ష‌న్ దృష్ట్యా ఆమెకు కూడా ఈ ఇండ‌స్ట్రీ మీద సానుకూల భావ‌న ఉన్న‌ట్లే క‌నిపించింది.

తొలి సినిమా దేవ‌ర త‌ర్వాత‌.. ఎక్కువ గ్యాప్ లేకుండా తెలుగులో పెద్ది మూవీలో న‌టించింది. ఈ రెండూ మంచి ఫ‌లితాల‌నే అందుకున్నాయి. దేవ‌ర ఓవ‌రాల్‌గా మంచి విజ‌య‌మే సాధించ‌గా.. పెద్ది తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు హిట్ స్టేట‌స్ అందుకుంది. ఇలా రెండు హిట్ల త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా.. ఇక్క‌డ మ‌రిన్ని సినిమాలు చేయాల‌నే అనుకుంటుంది. కానీ జాన్వి మాత్రం మ‌ళ్లీ తెలుగు మూవీలో క‌నిపించ‌డం సందేహంగానే ఉంది.

దేవ‌ర‌, పెద్ది సినిమాలు మంచి ఫ‌లితాల‌ను అందుకున్నా.. జాన్వికి మాత్రం అంత మంచి పేరేమీ రాలేదు. రెండింట్లోనూ ఆమెను గ్లామ‌ర్ డాల్‌గానే వాడుకున్నారు. ముఖ్యంగా పెద్దిలో అయితే ఆమె పాత్ర మ‌రీ తేలిపోయింది. త‌న‌ను ప్రెజెంట్ చేసిన తీరు మీద తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వివిధ ఇండ‌స్ట్రీల నుంచి నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చే స్థాయిలో జాన్వి పాత్ర మిస్ ఫైర్ అయింది. ఆమె మీద తీసిన కొన్ని సీన్లు రిలీజ్ త‌ర్వాత క‌ట్ చేయాల్సిన ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. ఈ ఫీడ్ బ్యాక్ అంతా జాన్వికి చేర‌కుండా ఉండ‌దు. 

బాలీవుడ్లో విభిన్న‌మైన పాత్ర‌లతో మంచి న‌టిగానూ పేరు సంపాదించింది జాన్వి. కానీ టాలీవుడ్ ద‌ర్శ‌కులు ఆమెను ఆ కోణంలో చూడ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసే పాత్ర‌లే డిజైన్ చేశారు. జాన్వి ఇమేజ్ కూడా దెబ్బ తినేలా చేశారు. దీంతో టాలీవుడ్ ప‌ట్ల జాన్వి ప్ర‌తికూల అభిప్రాయం ఏర్ప‌రుచుకుని ఉంటే ఆశ్చ‌ర్యం లేదు. మ‌రోవైపు ప్రేక్ష‌కుల నుంచి కూడా ఆమె ప‌ట్ల సానుకూల స్పంద‌న రాని నేప‌థ్యంలో ఇక‌పై తెలుగు ఫిలిం మేక‌ర్స్ కూడా ఆమె వైపు చూస్తారా అన్న‌ది డౌటే.

This post was last modified on August 13, 2026 9:47 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

4 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

6 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

8 hours ago