Political News

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై… ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి. తాజాగా చంద్ర‌బాబుపై రాళ్లు రువ్విన ఘ‌ట‌న సుప్రీంకోర్టు వ‌ర‌కు చేరింది. నిందితుల‌ను విచారించేందుకు.. సుప్రీకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క‌స్ట‌డీలోకి తీసుకోకుండానే.. వారిని విచారించాల‌ని తేల్చి చెప్పింది. ఈ ప‌రిణామం మొత్తం వైసీపీ నాయ‌కుల‌పై ప్ర‌భావం చూపిస్తోంది. త‌ద్వారా.. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై కేసుల ఎఫెక్ట్ ప‌డుతోంద‌ని అంటున్నారు.

టీడీపీలో ఉన్న నాయ‌కులు కూడా కేసులు ఎదుర్కొన్నారు. కానీ, వైసీపీకి, టీడీపీకి చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. టీడీపీ లీగ‌ల్ సెల్ ఉన్న ప‌టిష్ఠంగా వైసీపీ లేద‌న్న విష‌యం పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో టీడీపీ నాయ‌కులు అరెస్టు అయినా.. వారికి బ‌ల‌మైన స‌పోర్టు ఉంది. దీంతో వారు బ‌య‌ట‌కు వ‌చ్చేవారు. తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేవారు. కానీ, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మారిన చ‌ట్టాలు.. న‌మోద‌వుతున్న సెక్ష‌న్లు కూడా నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్తల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఒక్క‌సారి జైలుకు వెళ్తే.. మ‌ళ్లీ బ‌య‌ట‌కు రావ‌డం ఎప్పుడ‌న్న‌ది నాయ‌కుల‌కు సందేహంగా మారింది. కొన్ని కేసుల్లో మాత్ర‌మే నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా.. మ‌రిన్ని కేసుల్లో మాత్రం.. నాయ‌కులు.. నెల‌ల త‌ర‌బ‌డి జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు. ఈ ప‌రిణామం.. పార్టీలో దూకుడుగా ఉండే నాయ‌కుల‌కు మ‌రింత ఇబ్బందిగా మారింది. తాజాగా ఏదైనా కేసు న‌మోదై.. జైలుకు వెళ్తే.. పాత కేసుల‌ను కూడా పోలీసులు వెలికి తీస్తున్నారు. దీంతో బాబు వ‌ద‌ల‌రు.. అనే టాక్ వైసీపీ నాయ‌కుల మ‌ధ్య జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదే స‌మ‌యంలో గ‌తంలో టీడీపీ అధినాయ‌క‌త్వం ఆ పార్టీ నాయ‌కుల‌కు ఇచ్చిన‌ట్టుగా వైసీపీ నాయ‌కులు త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక పోతున్నారు. మేమున్నాం.. అనే మాట చెప్ప‌డం లేదు. ఇది కూడా.. నాయ‌కులు పార్టిసేట్ చేసేందుకు.. కేసుల‌కు వెనుకాడ‌కుండా ముందుకు వ‌చ్చేందుకు ప్ర‌తిబంధ‌కంగా మారింది.

ఈ నేప‌థ్యానికి తోడు.. ప‌టిష్ఠ‌మైన వ్య‌వ‌స్థ‌తో పోలీసులు డేగ‌క‌న్ను వేయ‌డం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. రాజ‌కీయ వ్యూహాలు ఎన్ని వేసినా.. క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను బ‌లంగా ముందుకు న‌డిపించేందుకు.. స‌రైన ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌లేక పోతున్నారు. ఫ‌లితంగా పార్టీ ఇరుకున ప‌డుతోంద‌ని చెబుతున్నారు.

This post was last modified on August 13, 2026 3:03 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

6 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

8 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

10 hours ago