Political News

చంద్ర‌బాబుతోనే అంతం కాదు.. ఆరంభం ఎప్పుడూ ఉంటుంది..!

రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఈ మాటే వినిపిస్తోంది. చంద్ర‌బాబుతోనేరాజ‌కీయాలు అంతం కావు. ఏపీ రాజ‌కీయాల్లోనే కాదు.. దేశ‌రాజ‌కీయాల్లో కూడా.. ఎప్పుడూ.. ఏదో ఒక ఆరంభం ఉంటూనే ఉంటుంద‌ని చెబు తున్నారు. ఇప్పుడు ఈ చ‌ర్చ ఎందుకు వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ చేస్తున్న కామెంట్ల కార ణంగానే. ఆయ‌న ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 26 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు జ‌గ‌న్ చెబుతున్న మాట ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌లే కీల‌కం. ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే.. 30 ఏళ్ల‌పాటు అధికారంలో ఉంటామ‌ని అంటున్నారు. దీనిని నాయ‌కుల‌కు బాగానే ఇంజెక్ట్ చేస్తు న్నారు. ఇక‌, మంత్రులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అంటే.. దీని అర్ధం, ప‌ర‌మార్థం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కే యాక్టివ్‌గా ఉంటార‌ని, త‌ర్వాత విశ్రాంతి తీసుకుంటార‌ని ఇక‌, త‌మ‌కు పోటీ ఉండ‌నే ఉండ‌ద‌ని.. ఇక‌, గెలుపు విష‌యంలో త‌మ‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆయ‌న భావిస్తుండ వ‌చ్చు.

కానీ, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌. నాయ‌కుల ప్రాబ‌ల్యం ఉన్నా.. లేకున్నా.. ప్ర‌జ‌ల విశ్వ‌స‌నీయ‌త‌, వారి అభిప్రాయం మేర‌కే.. ఈ వ్య‌వ‌స్థ న‌డుస్తోంది. నేడు చంద్ర‌బాబు ఉండొచ్చు.. త‌ర్వాత‌.. విశ్రాంతి తీసుకోవ చ్చు. అంత‌మాత్రాన‌.. ఆయ‌న లేక‌పోతే..ఏపీలో ఇక‌, రాజ‌కీయాలు చేసే నాయ‌కుడు కానీ, త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని కానీ, ఊహించుకోవ‌డం జ‌గ‌న్‌కు అతి అనిపించుకుంటుందే త‌ప్ప‌. మ‌రొక‌టి కాదు. ఒక‌ప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ కూడా.. గాంధీల కుటుంబం లేక‌పోతే.. దేశమే లేద‌ని.. ఇంద‌ర అంటే భారత్‌.. భార‌త్ అంటే ఇందిర అని ప్ర‌చారం చేసుకుంది.

గ‌త ప‌దేళ్లుగా ఈ పార్టీ ప‌రిస్థితి ఏంటి? అంతేకాదు, ఎన్టీఆర్ ఏమ‌య్యారు. ఆయ‌న లేక‌పోతే.. టీడీపీనే లేద‌ని.. ఒక‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింది వాస్త‌వం కాదా? ఆయ‌న లేక‌పోతే..తెలుగు వారికి నాయ‌కుడు లేర‌నే ప్ర‌చారం జ‌రిగింది వాస్త‌వం కాదా! అప్ప‌టికి మాత్ర‌మే వ‌ర్క‌వుట్ అయ్యే రాజ‌కీయాలు ఇవి. అంతే కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యామ్నాయాలు వెతుక్కోవ‌డం.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కు ఉన్న పెద్ద వెసులు బాటు. అంతెందుకు.. ఆరు మాసాల కింద‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను లెక్క‌చేయ‌లేదు.కానీ, ఇప్పుడు నిత్యం ఆయ‌న నామ‌స్మ‌ర‌ణ‌లోనే వైసీపీ మునిగితేలుతోంది.

సో.. ఇందుమూలంగా చెప్పుకొనేది ఏంటంటే.. 30 ఏళ్లు ఉంటామా? ఈ ఒక్క ఎన్నిక గ‌ట్టెక్కుతామా? అనేది కాకుండా.. ప్ర‌జ‌ల‌ను రంజింప చేసేందుకు, వారి ఆశ‌లు తీర్చేందుకు, ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విలువ ఇచ్చేందుకు.. ప్రాధాన్యం ఇస్తే.. అది 30 ఏళ్లా.. 300 ఏళ్లా అనేది స‌మ‌స్యేకాదు. ఏ లెక్క పెట్టుకుని ఒడిసా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.. పాల‌న చేస్తున్నారు. గ‌తంలో ఏలెక్క చూసుకుని.. గుజ‌రాత్‌లో బీజేపీ 27 ఏళ్లుగా చ‌క్రం తిప్పుతోంది? అంతెందుకు.. 35 ఏళ్ల‌పాటు బెంగాల్‌ను పాలించిన‌.. క‌మ్యూనిస్టులు ఏ లెక్క‌లు వేసుకున్నారు. అంతా కూడా ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు. ఈ చిన్న సూత్రాన్ని మ‌రిచిపోయి.. అంతా చంద్ర‌బాబు అనుకుంటే.. అక్క‌డే పెద్ద త‌ప్పు చేసిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు ప రిశీల‌కులు.

This post was last modified on November 19, 2022 10:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

1 hour ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago