Political News

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ పర్యటన నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న టీ దుకాణాలు, చిన్నపాటి టిఫిన్ సెంటర్లను కూడా వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.

జగన్ ఆలూరు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సాయంత్రం 3 గంటల వరకు దుకాణాలు తెరవకూడదని వ్యాపారులు నిర్ణయించినట్లు సమాచారం. కొందరు ఉదయం 10 గంటలకే దుకాణాలు మూసివేసి, సామగ్రిని భద్రపరిచి తాళాలు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జగన్ ఆలూరు వచ్చారు.

జగన్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. కొందరు బైకులతో రోడ్లపై హంగామా చేయడంతో పాటు సైలెన్సర్లు తొలగించిన వాహనాలతో శబ్దాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి.

జగన్ ప్రధాన రహదారిపైకి చేరుకునే ముందే కార్యకర్తలు బైకులతో విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. బైకులతో విన్యాసాలకు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

కేసులు తప్పవు

ఆలూరులో జరిగిన పరిణామాలపై పోలీసులు స్పందించారు. ఎలాంటి ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని, అయినప్పటికీ కొందరు కార్యకర్తలు బైకులతో రోడ్లపైకి వచ్చారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారిని గుర్తించి, వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ కార్యకర్తలు నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on August 13, 2026 10:00 pm

Share

Recent Posts

భాగ్య‌న‌గ‌రంలో ఒంట‌రి జీవులు.. !

దేశ‌వ్యాప్తంగా ఒంట‌రి జీవులు పెరుగుతున్నారా? అంటే.. తాజాగా అసోచామ్ స‌హా మ‌రో రెండు సంస్థలు చేసిన స‌ర్వే ఔన‌నే స‌మాధానమే…

23 minutes ago

మళ్లీ మొదలుబెట్టిన వైసీపీ నానీలు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో…

33 minutes ago

హీరో భార్యకు నచ్చలేదని హీరోయిన్ని తీసేశారట…

ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు…

2 hours ago

కాకా ఇంత పట్టుదలగా ఎందుకు ఉన్నాడు

చిరంజీవి కాకా స్పీడ్ మాములుగా లేదు. నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్వయంగా కొన్ని…

2 hours ago

చిరుతో మేన‌ల్లుడి పోటీ ప‌క్కా అట‌

ఒక‌ప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్. కానీ రోడ్డు ప్ర‌మాదం త‌ర్వాత త‌న కెరీర్…

4 hours ago

ఎదురుగాలిని తట్టుకుని నిలవడం గ్రేటే

ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…

5 hours ago