Movie News

అందుకే అతను రెబల్ స్టార్

ఒక పెద్ద స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అదే స్థాయి అందరికీ దక్కుతుందనుకోవడం అమాయకత్వం. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి మూలపురుషుడిని మించి కష్టపడాల్సి ఉంటుంది. లేదంటే నాలుగైదేళ్లకు కెరీర్ క్లైమాక్స్ కు వస్తుంది. అలా కాకుండా టాలీవుడ్ స్థాయిని ప్యాన్ ఇండియా లెవెల్ లో గర్వంగా చూపించాలంటే ఇంకెంత చెమట చిందించాలి. దానికి సరైన నిర్వచనమే అభిమానులు ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్. 2002లో ఈశ్వర్ తో లాంచ్ చేసినప్పుడు జనంలో తన మీద కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకునే బ్రాండ్ తప్ప ఇంకెలాంటి అభిప్రాయం లేదు. అది అతనికీ తెలుసు.

అందుకే డెబ్యూతోనే మాస్ టచ్ ఉన్న ప్రేమకథ చేయాల్సి వచ్చినా వెనక్కు తగ్గలేదు. రెండో ప్రయత్నం రాఘవేంద్ర దారుణంగా దెబ్బ తిన్నా వర్షంతో బాక్సాఫీస్ కు కొత్త స్టార్ వచ్చాడనే సంకేతం 2004లో ఇచ్చాడు. అడవిరాముడు, చక్రంలు నిరాశపరిచినా రాజమౌళి చేతిలో పడ్డాక ఛత్రపతి ద్వారా ప్రభాస్ లో రియల్ మాస్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. తిరిగి పౌర్ణమి, యోగి, మున్నాలు ఫ్లాప్ బాట పడితే బుజ్జిగాడు, బిల్లాతో మళ్ళీ ఎనర్జీని తెచ్చుకున్నాడు. ఏక్ నిరంజన్ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత దగ్గర చేశాయి. రెబల్ డిజాస్టరైనా అందులో స్టయిలింగ్ కి ఫాన్స్ ఉన్నారు.

కొత్త దర్శకుడిని నమ్మి చేసిన మిర్చి గురించి చెప్పేదేముంది. కెరీర్ ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు కేవలం జక్కన్న మీద నమ్మకంతో అయిదేళ్ల విలువైన కాలాన్ని బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ కోసం త్యాగం చేయడం ప్రభాస్ ని దేశవిదేశాల్లో ప్రేక్షకులకు తిరుగులేని ఫ్యానిజంని కట్టబెట్టింది. తెలుగు సినిమా వందల నుంచి వేల కోట్లకు ఎగబాకింది. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ లు నిరాశపరచవచ్చు గాక. కానీ ప్రభాస్ కట్టుకున్న సామ్రాజ్యంలో చిన్న ఇటుకను కూడా కదపలేకపోయాయి. అందుకే బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్, భారతదేశపు ఖరీదైన చిత్రం ప్రాజెక్ట్ కె అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. కెజిఎఫ్ దర్శకుడు వెంటపడినా, కంటెంట్ ని నమ్మి మారుతీ లాంటి డైరెక్టర్ కు ఎస్ చెప్పినా అది డార్లింగ్ కే చెల్లు. అందుకే తన పుట్టినరోజు అందరికీ ఇంత స్పెషల్.

This post was last modified on October 23, 2022 11:37 am

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

6 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

6 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

7 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

9 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

9 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

9 hours ago