రాజుగారి డర్టీ సినిమా ఓటిటీలో!

Dirty Hari

ఫామిలీ సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్. రాజు గత కొంత కాలంగా పరాజయ భారంతో, భారీ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. అందుకే మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు లాంటి సినిమాలు తీసిన ఆయన సక్సెస్ కోసం ఎరోటిక్ సినిమా అనౌన్స్ చేసారు. నిర్మాత ఆయన కాకపోయినా కానీ సదరు ఎరోటిక్ సినిమాకు రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

రుహాని శర్మ, శ్రవణ్ రెడ్డి జంటగా నటిస్తున్న ఈ చిత్రం పేరు డర్టీ హరి! ఈ చిత్రం నిర్మాణ పనులు పూర్తి కావడంతో డైరెక్ట్ ఓటిటీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ఓటిటీలో ఆదరణ ఉండడంతో ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయడానికి సంకల్పించారు.

రుహాని శర్మ చి.ల.సౌ. సినిమాతో పాటు హిట్ లో నటించింది కనుక పేస్ వేల్యూ పరంగా ఈ చిత్రానికి ఢోకా ఉండదు. ఎరోటిక్ సినిమాలో ఆమె కనుక తన మొదటి సినిమా ఇమేజ్ కి భిన్నంగా హాట్ గా నటిస్తే డర్టీ హరికి వ్యూస్ గురించిన బెంగ అక్కర్లేదు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content