వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ జరుగుతున్న పరిణామాలు డౌట్లను అంతకంతా పెంచుకుంటూ పోతున్నాయి. ముఖ్యంగా పోస్ట్ పోన్ వార్తలు ఎన్ని వస్తున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కార్తికేయ నుంచి దీన్ని ఖండిస్తూ ఎలాంటి కౌంటర్ రాకపోవడం మహేష్ బాబు అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. పైగా ప్రమోషన్లు కూడా మెల్లగా సైడ్ చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వారణాసి ఒకవేళ ఏప్రిల్ నుంచి తప్పుకుంటే కనక, జూలై చివరి వారం లేదా ఆగస్ట్ రెండో వారంలో మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. చూస్తుంటే రాజమౌళి ఇదంతా ముందే ఊహించినట్టు ఉన్నారు. ఎందుకంటే మొన్న ఆగస్ట్ లో మహేష్ బర్త్ డేకు ఏదైనా వీడియో టీజర్ వస్తుందని అభిమానులు కొండంత ఆశలు పెట్టుకుంటే కేవలం రెండు మొక్కుబడి స్టిల్స్ తో మమ అనిపించారు.
అంటే ఏప్రిల్ లో అవకాశాలు సన్నగిల్లుతాయని ముందే ఊహించి ఎలాంటి తొందరపాటు లేకుండా రాజమౌళి కూల్ గా ఉన్నారన్న మాట. వచ్చే సంవత్సరం ఆగస్ట్ అయితే మటుకు మంచి ఆప్షన్ అవుతుంది. అప్పటికి ఐపీఎల్, ఇంటర్నేషనల్ హాలీవుడ్ మూవీస్, పిల్లల పరీక్షలు లాంటి ఇబ్బందులు ఉండవు. వసూళ్లు పీక్స్ లో చూడొచ్చు కనీసం మూడు వేల కోట్ల వసూళ్లను టార్గెట్ గా పెట్టుకున్న వారణాసికి సోలో సీజన్ చాలా అవసరం. అందుకే ప్రతి ఆప్షన్ ఒకటికి పదిసార్లు విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది.
వీలైనంత త్వరగా వారణాసి బృందం నుంచి క్లారిఫికేషన్ వస్తే బాగుంటుంది. రామాయణకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా రెండు వేల కోట్ల మార్కుని అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ వారణాసికి అంతకు మించిన ఛాన్స్ ఉంది. ఫాంటసీ సబ్జెక్టు అందులోనూ జక్కన్న మార్కు ఎపిసోడ్లు ఎలివేషన్లు ఓ రేంజ్ లో పేలతాయి. కీరవాణి సంగీతం సరేసరి. ఆస్కార్ వచ్చింది కాబట్టి ఈసారి అంతకు మించిన మ్యూజిక్ ఇవ్వాలని కష్టపడతారు. రాజమౌళి బయట కనిపిస్తున్నారు కానీ వారణాసి గురించి అడిగే అవకాశం ఇవ్వడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates