దాదా ముందూ వెనకా ఎన్నో సవాళ్లు

బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు కూడా వదిలారు. దర్శకుడు గోపిచంద్ మలినేని స్వయంగా ధ్రువీకరించడంతో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. క్లైమాక్స్ త్వరలో స్టార్ట్ చేసి డిసెంబర్ పదికి గుమ్మడికాయ కొట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారని తెలిసింది. మధ్యలో ఎలాంటి ఆటంకాలు రాకపోతే దాదా ఆగమనం సాఫీగా ఉంటుంది.

అయితే ముందు వెనుకా ఎన్నో సవాళ్లు దాదాకు స్వాగతం చెప్పబోతున్నాయి. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా చేసిన సౌండ్ చాలా తక్కువ. తమన్ కంపోజ్ చేసిన మొదటి పాటకు మిశ్రమ స్పందన దక్కింది. వైరల్ అయ్యే స్థాయిలో ట్యూన్ లేదని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఇంతకు ముందు వచ్చిన టీజర్ కేవలం దాదా ఇంట్రో కాబట్టి అసలు ట్రైలర్ వస్తేనే ఎన్ని అంచనాలు పెట్టుకోవాలో క్లారిటీ వస్తుంది. బాలయ్య గాయం వల్ల ఆ మధ్య గ్యాప్ రావడంతో ప్రచారాన్ని సరైన రీతిలో ప్లాన్ చేసుకోలేకపోయారు.

దాదా వచ్చే అదే రోజు నాగార్జున కింగ్ 100 వస్తుంది కాబట్టి థియేటర్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి వారం ముందు వస్తున్న అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ పార్ట్ 3 మీద ఇండియాలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. కనీసం రెండు వారాలు బలంగా ఆడతాయని బయ్యర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే ఓవర్సీస్ తో పాటు ఏపీ తెలంగాణలోనూ వీటితో దాదా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో పెద్ద ముప్పు షారుఖ్ ఖాన్ కింగ్ రూపంలో రానుంది.

దానికి కూడా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇన్ని ప్రతికూలతలు ఎన్ని ఉన్నప్పటికీ దాదా కంటెంట్ విషయంలో మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు డెబ్యూ మూవీ పెద్దితో మంచి విజయాన్నే అందుకున్నప్పటికీ అన్ని ఏరియాల్లో లాభాలు చూడలేదు. దాదా ఆ లోటు పూడుస్తుందనే నమ్మకంతో బడ్జెట్ కోణంలో రాజీ పడలేదు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన దాదాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచు మనోజ్ మరోసారి విలన్ అవతారం ఎత్తాడు.