రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన ఆల్బమ్స్ నుంచి వచ్చే మొదటి పాట ఎప్పుడూ బ్యాంగర్ గానే ఉంటుంది. గోదారి గట్టుపైన, మీసాల పిల్ల ఏ రేంజ్ లో రీచ్ తెచ్చుకున్నాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే డివిక్కీ డివిక్కి మీద ఆ స్థాయిలో పాజిటివిటీ కనిపించకపోవడం గురించి ఆందోళన చెందుతూ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది.  

సాంగ్ కంపోజింగ్ ఏమో కానీ కీర్తి సురేష్, కృతి శెట్టి గ్లామర్ హైలైట్ అయ్యేలా చిత్రీకరించిన విధానం మీద మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఉంది. ఫ్యామిలీస్ ని లక్ష్యంగా పెట్టుకునే రావిపూడి ఏనాడూ గీత దాటింది లేదు. ఎప్పుడూ ఆ ఆలోచన చేయలేదు. కానీ డివిక్కీ సాంగ్ లో కాస్ట్యూమ్స్ సాంప్రదాయబద్దంగా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లను చూపించిన విధానం ఈసారి అంత నీట్ గా లేదనేది కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదంతా అనిల్ కు తెలియకుండా పోదు.

ఏది ఎలా ఉన్నా జనంలోకి అనిల్ రావిపూడి కంటెంట్ చొచ్చుకుపోవడం నిజం. ఇప్పుడు ఎంత మాట్లాడినా ఇదే డివిక్కీ పాట ఇంకో వారం పది రోజుల్లో ఎక్కువ రీచ్ తెచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఎంతో కొంత డెంట్ పడింది కాబట్టి దాన్ని సరిదిద్దేలా మరో ఛార్ట్ బస్టర్ సాంగ్ వీలైనంత త్వరగా దింపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎలాగూ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ల మీద ఏదో ఫ్రెండ్ షిప్ పాట ఉందని లీక్ వస్తోంది. అది కనక కరెక్ట్ గా కుదిరితే ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్లు మాయమైపోతాయి.

సంక్రాంతి దగ్గర పడుతున్న నేపథ్యంలో పబ్లిసిటీ పరంగా రావిపూడి సరికొత్త ఎత్తుగడలతో రెడీ కాబోతున్నారు. కాంపిటీషన్ అసలే చాలా టఫ్ గా ఉంది. కాకా మీద ప్రీ రిపోర్ట్స్ బాగున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ ఒక్క టీజర్ తో జనాల దృష్టిలో పడింది. జార్జ్ క్రిష్ రూపంలో శ్రీను వైట్ల కంబ్యాక్ అవుతారనే టాక్ ఫిలిం నగర్ లో తిరుగుతోంది. మహాకాళి కూడా బాగా వస్తోందట. సంబరాల ఏటిగట్టు వచ్చేది లేనిది ఇంకా తేలలేదు. ఎవరేం చేసినా రావిపూడి మార్కుని అందుకోవడం దాటడం అంత ఈజీ అయితే కాదు.