డింపుల్ హయతి.. ఈ పేరు చూస్తే ఎవరో నార్త్ అమ్మాయి అనుకుంటాం. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయే అనే విషయం లేటుగా తెలిసింది. పాతతరం నటి ప్రభకు ఆమె మనవరాలు కావడం విశేషం. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘సూపర్ హిట్టు’ పాటతో డింపుల్ పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత కథానాయికగా ‘ఖిలాడి’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించింది.
ఇప్పుడు తన నుంచి ‘భోగి’ సినిమా రాబోతోంది. ఇందులో తన ఇమేజ్‌కు భిన్నమైన, నటనకు ప్రాధాన్యమున్న పాత్రనే చేసినట్లుంది డింపుల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఐతే మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఏదో కారణం వల్ల అనుపమ హాజరు కాలేదు. ఆ ఈవెంట్లో డింపులే హైలైట్ అయింది.
ఆమె హీరో శర్వానంద్‌తో ఎంతో సన్నిహితంగా మెలగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీని మీద కొందరు నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. ఆల్రెడీ పెళ్లయిన శర్వా.. హీరోయిన్‌తో అంత క్లోజ్‌గా ఉండడమేంటి, ఆమెను అంత గట్టిగా పట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నలు సంధించారు కొందరు. ఐతే డింపుల్‌కు కూడా పెళ్లయింది కదా అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేయగా.. దీని మీద డింపుల్ స్పందించడం విశేషం.
తనకు పెళ్లి కాలేదని ఆమె కూల్‌గా బదులిచ్చింది. డింపుల్‌కు చాలా ఏళ్ల నుంచి ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్న సంగతి చాలామందికి తెలుసు. వీళ్లిద్దరూ ఒక అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉండడం, అక్కడ ఒక వివాదం తలెత్తి వార్తల్లో నిలవడం గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పటికీ ఆ వ్యక్తితో డింపుల్ కలిసి ఉంటోందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ రిలేషన్‌షిప్ కొనసాగుతోందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకపోయినా.. తనకైతే పెళ్లి కాలేదని డింపుల్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ‘భోగి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates