జాన్వి ర‌చ్చ‌.. శ్రుతి హాస‌న్ రియాక్ష‌నేంటి

పెద్ది సినిమాలో త‌న పాత్ర‌ను ప్రెజెంట్ చేసిన తీరు గురించి బాలీవుడ్ భామ జాన్వి క‌పూర్ ఈ మ‌ధ్య కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. సినిమాలో న‌టించేట‌పుడు, రిలీజ్ టైంలో ఏ ఇబ్బందీ లేన‌ట్లు వ్య‌వ‌హ‌రించిన జాన్వి.. త‌ర్వాత మాత్రం ఈ సినిమాలో న‌టించినందుకు జీవితాంతం అవ‌మాన భారాన్ని మోయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు వ్యాఖ్యానించడం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

ఇందులో త‌న బాధ్య‌త కూడా ఉందంటూనే జాన్వి పెద్ది ద‌ర్శ‌కుడిని, ఆ టీంను త‌క్కువ చేసేలా మాట్లాడ‌డం మీద పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఐతే ఆమె కామెంట్ల‌ను రెజీనా క‌సాండ్రాతో పాటు చాలామంది త‌ప్పుబ‌ట్టారు. పాత్ర న‌చ్చ‌క‌పోతే నో చెప్పే ఆప్ష‌న్ ఉంది క‌దా అంటూ చాలామంది జాన్విని నిల‌దీశారు.

ఐతే ఇప్పుడు పెద్ది సినిమాలో భాగ‌మైన శ్రుతి హాస‌న్‌కు.. ఒక ఇంట‌ర్వ్యూలో జాన్వి కామెంట్స్ మీద ప్ర‌శ్న ఎదురైంది. ఐతే శ్రుతి జాన్వి పాత్ర గురించి, త‌న వ్యాఖ్య‌ల గురించి ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. తాను మ‌రో న‌టి గురించి ఎలా స్పందిస్తాన‌ని.. ఆమె కూడా త‌న గురించి మాట్లాడ‌లేద‌ని.. ఇది త‌న ప‌రిధిలోని విష‌యం కాద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. త‌న వ‌ర‌కు మాత్రం ఈ టాపిక్ మీద మాట్లాడ‌తాన‌ని ఆమె అంది.

ఐటెం సాంగ్ కావ‌చ్చు, ఒక స‌న్నివేశం కావ‌చ్చు.. త‌న‌కు న‌చ్చితే చేస్తాన‌ని, న‌చ్చ‌క‌పోతే నో చెప్పే స్వేచ్ఛ‌ త‌న‌కు ఉంద‌ని శ్రుతి చెప్పింది. త‌న టీంలోని వ్య‌క్తులు కూడా ఏదైనా అభ్యంత‌ర‌క‌రంగా ఉంటే త‌న‌కు చెబుతార‌ని.. ఐతే కొన్నిసార్లు తెలియ‌కుండా కొన్ని విష‌యాలు జ‌రిగిపోతుంటాయ‌ని.. ఒక సంద‌ర్భంలో త‌ప్పు అనిపించేది, ఇంకో సంద‌ర్భంలో అలా అనిపించ‌క‌పోవ‌చ్చ‌ని ఆమె వ్యాఖ్యానించింది.

ఐటెం సాంగ్ కావ‌చ్చు, ఒక సీన్ కావ‌చ్చు, ఒక ఫైట్ సీక్వెన్స్ కావ‌చ్చు.. తాను, త‌న టీంలో స‌రైన సింక్‌లో ఉంటామ‌ని.. జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తామ‌ని.. త‌మ‌కు అభ్యంత‌రకరంగా అనిపిస్తే త‌న టీం స‌భ్యులు త‌న‌కు చెబుతార‌ని ఆమె అంది. ఐతే ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేయడాన్ని తాను ఆస్వాదిస్తాన‌ని. పెద్ది పాట విష‌యంలోనూ తాను సౌక‌ర్య‌వంతంగానే ఉన్నాన‌ని ఈ సంద‌ర్భంగా శ్రుతి చెప్పింది. ఐతే కొన్నిసార్లు తెలియ‌కుండా త‌ప్పులు జ‌ర‌గొచ్చ‌ని ఆమె వ్యాఖ్యానించింది.