పిక్ టాక్: వీర వనితగా సెక్సిణి

‘మహర్షి’ సినిమాకు పని చేసిన ఫేమస్ కెమెరామన్ మోహనన్ తనయురాలైన మాళవిక మోహనన్.. తెలుగులో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ మన కుర్రాళ్లలో ఆమెకున్న ఫాలోయింగే వేరు. బాలీవుడ్లో దిశా పఠాని తరహాలో కేవలం హాట్ హాట్ ఫొటో షూట్లతోనే సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన అమ్మాయి మాళవిక. సౌత్‌లో ఇప్పుడు ఆమెకున్న సెక్సీ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ షేప్ మెయింటైన్ చేస్తూ.. ప్రతి ఫొటో షూట్లోనూ సెక్సీ లుక్స్‌‌తో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు మిగిలుస్తూ ఉంటుంది మాళవిక. ఒక్కోసారి ఒక్కో థీమ్‌తో ఫొటో షూట్లు చేసే మాళవిక.. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.

తాజాగా ఆమె వారియర్ ప్రిన్సెస్ అవతారంలోకి మారింది. తాను ఏదో ఒక కాలంలో వారియర్ ప్రిన్సెస్ అయ్యే ఉంటానంటూ ఈ థీమ్‌లో లుక్ రిలీజ్ చేసింది. వీర వనిత అవతారం ఎత్తినా ఆమెలో గ్లామర్‌కేమీ లోటు లేదు. ఎక్కడేం చూపించాలో అన్నీ చూపించింది. ఎలాంటి లుక్‌లో అయినా సెక్సీగా కనిపించడం మాళవికకే చెల్లిందంటూ ఆమె ఫాలోవర్లు కొనియాడుతున్నారు. కెరీర్ విషయానికి వస్తే మాళవిక చివరగా ‘మాస్టర్’ సినిమాతో పలకరించింది. ఆ చిత్రంతో తన దశ తిరిగిపోతుందనుకుంది కానీ.. అలా ఏమీ జరగలేదు. తమిళంలో ధనుష్ సరసన చేస్తున్న ‘మారన్’ మినహాయిస్తే సౌత్‌లో ఆమెకు మరో సినిమా లేదు.

హిందీలో ‘యుద్ర’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది మాళవిక. తెలుగులో విజయ్ సరసన ‘హీరో’ అనే సినిమాతో నేరుగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ.. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల మొదలైన కొన్నాళ్లకే ఆగిపోయింది.